చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడి పై దాడి..!!
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్ పైన దాడి జరిగింది. తన కుమారుడు పైన దుండగులు దాడి చేసినట్లు రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.ప్రస్తుతం ఆయన టెంపుల్ మూమెంట్ ఫౌండర్ గా ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ సమీపంలోని అర్చకుల ఇంట్లో చొరబడి రంగరాజన్పై దాడి చేసి గాయపరిచారని వివరించారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో రంగ రాజన్ నివాసానికి కొందరు వ్యక్తులు వచ్చినట్లు సౌందర్య రాజన్ వివరించారు. రామరాజ్య స్థాపన కు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అయితే, ఆ సమయంలో దురుసుగా వ్యవహరించారని.. వారి మాట కాదన్నందుకు రంగరాజన్ పైన దాడికి పాల్పడ్డారని లేఖ లో పేర్కొన్నారు. హింసించ టంతో పాటుగా తన పైనా దాడికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. ఈ దాడికి దిగిన వారితో పాటుగా పరోక్షంగా కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.

సౌందర్ రాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన కు కారణం ఏంటనే అంశం పైన పోలీసులు ఫోకస్ చేసారు. సౌందర్ రాజన్ హిందూ ధార్మిక వ్యవహారాల పైన తరచూ స్పందిస్తూ ఉంటారు. తాజాగా ముత్యాలమ్మ ఆలయం ఘటన సమయంలోనూ సందర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్ కు మద్దతు ఇచ్చారు. వీసా బాలాజీ టెంపుల్ గా పేరున్న చిలకూరు ఆలయం ప్రధానార్చకుడి పైన దాడి జరగటంతో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications