అమెరికాలో హైదరాబాదీపై దాడి: జై శంకర్‌కు బాధితుడి భార్య లేఖ

హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన సయ్యద్‌ మజాహిర్‌ అలీ అనే హైదరాబాద్‌ విద్యార్థిపై కొందరు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితమే లంగర్‌హౌజ్‌ హషీమ్‌నగర్‌కు చెందిన మజాహిర్‌ అలీ అమెరికా వెళ్లి అక్కడి ఇండియానా వెస్లయన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రోజు రాత్రి అతడు హోటల్ నుంచి ఇంటికెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడి తల, ముక్కు, కళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తంధారగా కారతుండగానే తనపై జరిగిన దాడి గురించి ఓ వీడియో రికార్డు చేశాడు. దానికి దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా జత చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని, అమెరికా ఎంబసీని కోరాడు.

attack on hyderabad student in chicago: victims wife writes letter to EAM jai shankar to help him

దాడి విషయం తెలుసుకున్న సయ్యద్ అలీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతడి పరిస్థితి ఎలా ఉందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సయ్యద్ భార్య ఫాతిమా రిజ్వి తన భర్తకు సాయం చేయాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌కు లేఖ రాశారు.

తన భర్తపై దాడి జరిగిందని అతడి స్నేహితుడొకరు ఫోన్‌ చేసి చెప్పారని తెలిపారు. ప్రస్తుతం సయ్యద్ భద్రతపై ఆందోళనగా ఉందని తెలిపారు. దయచేసి తన భర్తకు సరైన చికిత్స అందేలా చూడాలని, వీలైతే తానూ అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని ఆమె లేఖలో జైశంకర్‌ను కోరారు బాధితుడి భార్య ఫాతీమా.


ఇది ఇలావుండగా, సయ్యద్‌పై దాడి ఘటనపై అమెరికా చికాగోలోని భారత కాన్సులేట్‌ స్పందించింది. బాధిత విద్యార్థి మజాహిర్‌ అలీ, ఆయన భార్యతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. వారికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించామని భారత కాన్సులేట్ హామీ ఇచ్చింది. కాగా, ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది. దుండగుల దాడుల్లో కొందరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+