ఎయిర్ ఇండియా ఉద్యోగినిని దోచుకున్న ఆటో డ్రైవర్ అరెస్ట్ (ఫోటోలు)
హైదరాబాద్: ఎయిర్ ఇండియా ఉద్యోనిపై దాడి చేసి ఆమె వద్ద నగదును దోచుకున్న ఆటో డ్రైవర్‌తో పాటు అతడికి సహకరించిన తోడల్లుడిని హుమయున్ నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు, గెలాక్యీ ట్యాబ్, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గుడిమల్కాపూర్ ప్రాంతంలో నివసించే శ్రీమంతిని(57) ఎయిర్ ఇండియా ఆఫీసులో కస్టమర్ సర్వీస్‌లో పనిచేస్తోంది. ఈ నెల 5వ తేదీన రాత్రి వైజాగ్ నుంచి నగరానికి వచ్చిన ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మెహిదీపట్నంకు వచ్చి, ఇంటికి వెళ్లడానికి సరోజినీదేవి కంటి ఆసుపత్రి వద్ద ఆటో మాట్లాడుకుంది.

ఎయిర్ ఇండియా ఉద్యోగినిని దోచుకున్న ఆటో డ్రైవర్ అరెస్ట్
ఈ మేరకు అసిఫ్ నగర్ విశ్వాస్ నగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్ అలియాస్ ఉమర్ (21) తన ఆటోలో ఆమెను ఎక్కించుకున్నాడు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ 3 వద్ద తన ఆటోను రైతు బజార్ మీదుగా రైతుబౌలి వైపునకు తిప్పాడు.

ఎయిర్ ఇండియా ఉద్యోగినిని దోచుకున్న ఆటో డ్రైవర్ అరెస్ట్
దీంతో శ్రీమంతిని అతడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించగా 21వ పిల్లర్ వద్ద ఆటో ఆపి ఆమెపై దాడి చేసి ఐదు తులాల బంగారు ఆభరణాలు, ట్యాబ్, వెయ్యి రూపాయల నగదు తీసుకుని పారిపోయాడు. అదే రోజు అర్ధరాత్రి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

ఎయిర్ ఇండియా ఉద్యోగినిని దోచుకున్న ఆటో డ్రైవర్ అరెస్ట్
రాత్రి వేళల్లో ఆటోలు నడిపేవారి వివరాలను సేకరించగా అక్బర్ గురించి సమాచారం అందింది. దీంతో బుధవారం ఉదయం అసీఫ్ నగర్‌లో అక్బర్ ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. కాగా, గతంలో అక్బర్ జైలుకు వెళ్లి వచ్చాడు.

ఎయిర్ ఇండియా ఉద్యోగినిని దోచుకున్న ఆటో డ్రైవర్ అరెస్ట్
అంతేకాకుండా జూన్ 5వ తేదీన జహీరాబాద్ బీదర్ రోడ్‌లో అక్బర్ తన తోడల్లుడు మహ్మద్ చోటుతో కలిసి ఇద్దరు మహిళలపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డట్టు డీసీపీ తెలిపారు. అక్బర్ ఇచ్చిన సమాచారంతో చోటును కూడా అరెస్ట్ చేశారు. ఈ ఏడాది పశ్చిమ మండలం పరిధిలో కేసులను 24 నుంచి 48 గంటల్లోపే పోలీసులు చేధిస్తున్నారు.












Click it and Unblock the Notifications