8షేవింగ్ బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్..ఆపరేషన్ లేకుండా గాంధీ వైద్యులు ఎలా కాపాడారంటే
చాలామంది క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలానే క్షణికావేశంలో 8 షేవింగ్ బ్లేడ్ లను ముక్కలు చేసి మింగేసిన ఓ వ్యక్తి ని కాపాడడానికి గాంధీ వైద్యులు నానా తంటాలు పడ్డారు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ఖాజా 8 షేవింగ్ బ్లేడ్ లను ముక్కలుగా చేసి మింగేశాడు.
బ్లేడు ముక్కలు మింగిన ఆటో డ్రైవర్
కాసేపటికి కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో తాను బతకనని ఏడవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తరలించగా గాంధీ ఆసుపత్రి వైద్యులు ఎటువంటి ఆపరేషన్ చేయకుండా చాలా క్లిష్టమైన ఈ కేసులో సదరు ఆటోడ్రైవర్ ప్రాణాలను కాపాడారు. మూడు రోజుల్లో కడుపులోని 16 పదునైన బ్లేడ్ ముక్కలను సురక్షితంగా బయటకు రప్పించారు.

ప్రోటాన్ పంప్ విధానంలో బ్లేడ్ ముక్కలు బయటకు
గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సునీల్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం ఖాజా పొట్టలో ఉన్న బ్లేడు ముక్కలను తొలగించడానికి తొలుత ఎండోస్కోపీ చేయాలని భావించారు. అయితే బ్లేడు ముక్కలు కావడంతో లోపల గాయమై రక్తస్రావం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విధంగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రోటాన్ పంప్ అనే ప్రత్యేక వైద్యప్రక్రియ ద్వారా ఖాజా పొట్టలో ఉన్న బ్లేడ్ ముక్కలను బయటకు రప్పించారు.
మూడు రోజుల చికిత్సతో ఆటో డ్రైవర్
ఖాజాకు ఆహారం, నీళ్లు ఏమి ఇవ్వకుండా ఇంట్రా వీనస్ ద్వారా ద్రవాలను ఎక్కిస్తూ బ్లేడ్ ముక్కలు నెమ్మదిగా మల విసర్జన ద్వారా బయటకు వచ్చేలా చేశారు. మూడు రోజులపాటు సాగిన ఈ చికిత్సలో బ్లేడ్ ముక్కలని బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా కడుపులో ఎటువంటి బ్లేడ్ ముక్కలు లేవని నిర్ధారించుకున్నాక వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.
శస్త్ర చికిత్స లేకుండా ప్రాణాలు కాపాడిన వైద్యులు
ఇక క్షణికావేశంలో బ్లేడు ముక్కలను మింగిన ఖాజా వైద్యుల చికిత్సతో పూర్తిగా కోల్పోవడంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్న రోగి ప్రాణాలను ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండా కాపాడగలిగామని ఈ సందర్భంగా వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications