బండి సంజయ్ ఎవడ్రా! నువ్వెంత.. నీ బతుకెంత?: బీజేపీ కార్యకర్తపై బాబు మోహన్ బూతులు
ఆందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబు మోహన్.. జోగిపేటకు చెందిన పార్టీ కార్యకర్తను తీవ్రంగా దుర్భాషలాడారు. నువ్వెంత.. నీ బతుకెంత? అంటూ బీజేపీ కార్యకర్త వెంకటరమణపై తీవ్రస్థాయిలో బూతులు తిట్టారు.
హైదరాబాద్: ఆందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబు మోహన్.. జోగిపేటకు చెందిన పార్టీ కార్యకర్తను తీవ్రంగా దుర్భాషలాడారు. నువ్వెంత.. నీ బతుకెంత? అంటూ బీజేపీ కార్యకర్త వెంకటరమణపై తీవ్రస్థాయిలో బూతులు తిట్టారు. తనకు మళ్లీ ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. అయితే, ఇందుకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన మాట్లాడిన మాటలు బీజేపీలో కలకలంగా మారాయి.

నువ్వెంత? నీ బతుకెంత? అంటూ బాబు మోహన్ బూతులు
పార్టీలో ఉండి మీతో కలిసి పనిచేస్తానంటూ ఫోన్ చేసిన వెంకటరమణపై శివాలెత్తిపోయారు మాజీ మంత్రి బాబు మోహన్. తాను రాష్ట్ర స్థాయి, ప్రపంచ స్థాయి నాయకుడినంటూ వ్యాఖ్యానించారు. అసలు నువ్వెంత? నీ బతుకెంత? అంటూ బూతులు వదిలారు. మరోసారి ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతో కొడతా అంటూ మండిపడ్డారు. తనకు మళ్లీ ఫోన్ చేయొద్దంటూ హెచ్చరించారు.

బండి సంయ్ ఎవడ్రా.. అంటూ బాబు మోహన్ సంచలనం
అంతేగాక, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు బాబు మోహన్. 'బండి సంజయ్ ఎవడ్రా.. వాడు నా తమ్ముడు' అని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే పార్టీకి రేపే రాజీనామా చేస్తా.. నువ్వు కావాలో.. నేను కావాలో.. పార్టీ తేల్చుకుంటుంది అని ఆ కార్యకర్తతో బాబు మోహన్ అన్నారు. నీ వయస్సు ఎంత గాడిద.. కావాలంటే ఫోన్ కాల్ రికార్డు చేసుకో.. ఇంకోసారి ఫోన్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కార్యకర్తకు వార్నింగ్ ఇచ్చారు బాబు మోహన్. కాగా, ఈ కాల్ ఆడియో వైరల్ కావడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారారు బాబు మోహన్.

ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బాబు మోహన్?
ప్రస్తుతం బాబు మోహన్ బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ.. ఇటీవల కాలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆందోళ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాబు మోహన్.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. 2004, 2009లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో ఆందోళ్ నుంచి పోటీ చేసి దామోదరపై గెలుపొందారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో విభేదాలతో 2018లో ఆ పార్టీని వీడిన బాబు మోహన్.. బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆందోల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఇతర పార్టీ నేతలను కలుపుకుపోవడంలో బాబు మోహన్ అంతగా ఆసక్తి చూపడం లేదని స్థానిక పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా, బాబు మోహన్ చేసిన రాజీనామా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మరో పార్టీ వైపు చూస్తున్నారా? అనే సందేహాలకు తావిస్తోంది.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications