చేతిలోంచి జారి ఎస్కలేటర్ మధ్యలో పడిన పాప
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ ఎక్కబోయిన ఒక వ్యక్తి అదుపుతప్పడంతో చేతిలో ఉన్న మనవరాలు ఎస్కలేటర్ మధ్య భాగంలో పడిం ది. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు ఎస్కలేటర్ మధ్యలో పడిన పాపను బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. ఉప్పుగూడకు చెందిన మహాలక్ష్మి తన ఏడాదిన్నర ఏళ్ల పాప మహేశ్వరి, తాత నరేందర్‌తో కలిసి బుధవారం సాయంత్రం మల్కాజిగిరి వెళ్లడానికి ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ రైలెక్కి సికింద్రాబాద్‌లో దిగారు.
ఆరవ నెంబర్ ప్లాట్‌ఫారం నుంచి మరో ప్లాట్‌ఫారం వద్దకు వెళ్లడానికి నరేందర్ తన మనవరాలు మహేశ్వరిని ఎత్తుకుని మొదటిసారిగా ఎస్కలేటర్ ఎక్కబోయాడు. దీంతో నరేందర్ అదుపుతప్పడంతో చేతిలో ఉన్న పాప ఎస్కలేటర్ మధ్యభాగంలో పడిపోయింది. వెంటనే రైల్వే పోలీసులు స్పందించి పాపను బయటకుతీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మహేశ్వరికి స్వల్ప గాయాలయ్యాయి.

పులిచర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తి అరె్టు
పులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వృద్ధుడ్ని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7 లక్షల విలువ చేసే పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. కొంపల్లి సాయికృప అపార్టుమెంట్‌లో నివాసముండే చర్మాస్ కంపెనీ ఉద్యోగి సత్యనారాయణ (70) కొద్దిరోజులుగా పులి చర్మాన్ని సంచిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ విషయం ఎస్‌వోటీ పోలీసులకు తెలిసింది.
బుధవారం ఎస్‌వోటీ ఓఎస్‌డీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని బృందం సభ్యులు సత్యనారాయణను సంప్రదించారు. 7 లక్షల రూపాయలకు అమ్ముతానని అతడు చెప్పడంతో అంగీకరించారు. గుండ్లపోచంపల్లి వద్దకు సత్యనారాయణ పులి చర్మాన్ని తీసుకురాగా అదుపులోకి తీసుకొని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.
నిందితుడు సత్యనారాయణను ఏసీపీ శ్రీనివాస్‌రావు విచారించగా తాను ఉత్తరప్రదేశ్‌లోని రాయిగడ్ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి వద్ద నుంచి 15 వేలకు కొనుగోలు చేశానని, డబ్బు ఆశతో అమ్మేందుకు యత్నించానని తెలిపాడు. అతన్ని బాలానగర్ డీసీపీ ముందు హాజరుపరిచి దూల్లపల్లి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications