MGBS నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం..
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి శుక్రవారం మూసీ నది ఉప్పొంగింది. ముసారాంబాగ్, చాదర్ ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉద్ధృతంగా ప్రవహించింది. వరద కారణంగా మహాత్మాగాంధీ బస్టాండ్(MGBS)లోకి భారీగా నీరు చేరింది. అయితే మూసీ వరద కారణంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. అయితే తాజాగా వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
మూసీ వరద తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. వరద కారణంగా పేరుకుపోయిన బురద, చెత్తను ఆర్టీసీ సిబ్బంది శుభ్రం చేసింది. ఈ క్రమంలో బస్టాండ్ ప్రయాణికులతో కళకళలాడుతుతోంది. సెలవులు కావడంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. తాజాగా సర్వీసులు ప్రారంభం కావడంతో అన్ని జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు బస్సులు బయలు దేరుతున్నారు.

శనివారం కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించింది. వరద పోటెత్తింది. నదీ ప్రవాహంలోకి నీరు భారీగా చేరిన నేపథ్యంలో రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. అలాగే ఎంజీబీఎస్ లోకి వరద నీరు చేరింది. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు ప్రకటన చేశారు. కానీ వరద తగ్గిపోవడంతో తాజాగా సర్వీసులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి జిల్లాలకు బస్సులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు పికప్ పాయింట్ల వద్దకు వెళ్లాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications