బండి సంజయ్ కుటుంబంలో‘బలగం’ సీన్ రిపీట్: ఎంపీ భావోద్వేగం
కరీంనగర్: పదో తరగతి ప్రశ్నపత్రం కేసులో అరెస్టై, విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుటుంబంలో ఇటీవల విడుదలైన టాలీవుడ్ సినిమా 'బలగం'లోని కీలక సన్నివేశం రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో తాతకు పిండం పెడితే పిట్టముట్టనట్లే.. బండి సంజయ్ అత్తగారు చనిపోవడంతో ఆమెకు పిండం పెడితే కూడా పిట్ట ముట్టలేదు. ఈ విషయాన్ని బండి సంజయ్ స్వయంగా వెల్లడించారు.
తన అమ్మ తర్వాత తనను కన్న కొడుకులా చూసుకున్నారని.. తాను లేకపోవడడంతో పక్షి తన అత్త కోసం పెట్టిన పిండం ముట్టలేదంటూ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలే బండి సంజయ్ అత్తగారు చనిపోగా.. ఐదో రోజు పిట్టకు పిండం పెట్టారు.. అయితే, ఎంత సేపటికీ కూడా పిట్ట ముట్టలేదు. ఆ సమయంలో తనను అరెస్ట్ చేశారని బండి సంజయ్ తెలిపారు.

కొందరు పోలీసులు కేవలం పోస్టుల కోసం, పైసల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఓ పార్లమెంటు సభ్యుడితో ప్రవర్తించే తీరు ఇదేనా? అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఆలోచన ప్రకారం.. దేశం ఫస్ట్ అని ఆ తర్వాతే పార్టీ, ఫ్యామిలీ అని వ్యాఖ్యానించారు.
కాగా, పదో తరగతి ప్రశ్నపత్రం కేసులో అరెస్టైన తర్వాత జైలులో ఉన్న సమయంలో బండి సంజయ్‌ను ఆయన భార్య అపర్ణ, సోదరులు కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తనతో కొన్ని మాటలు చెప్పారని అపర్ణ తెలిపారు. అత్తగారి కర్మకు హాజరయ్యేందుకు వచ్చిన తనను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగానే.. పోలీసులకు వేణు దర్శకత్వంలో ఇటీవలు విడుదలైన 'బలంగం' సినిమాను చూపిస్తే బాగుండేదని సంజయ్ అన్నట్లు చెప్పారు. అప్పుడైనా వారికి ఫ్యామిలీ ఎమోషన్స్ అర్థమయ్యేవని సంజయ్ తనతో తెలిపినట్లు అపర్ణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications