మంచి మనసు చాటుకున్న బాలయ్య..
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. అకాల వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు తన వంతుగా రూ. 50 లక్షల ఆర్ధిక సాయాన్ని CMRF కు అందిస్తున్నట్లు బాలయ్య ప్రకటించారు. తెలంగాణలోని కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి ప్రాణనష్టం, పంటనష్టంపై బాలకృష్ణ తాజాగా స్పందించారు. రైతులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. మున్ముందు కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల తెలంగాణలోని భారీ వర్షాలకు కామారెడ్డి, జగిత్యాల, మెదక్ రైతులు పూర్తిగా నష్టపోయిన విషయం తెలిసిందే. వరదల ధాటికి పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో వరద బాధితులకు ఆదుకునేందుకు బాలకృష్ణ ముందుకొచ్చారు. బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. మున్ముందు కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. వరద ప్రవాహం కారణంగా చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూర ప్రయాణాలు చేసే వారు తమ యాత్రలను వాయిదా వేసుకున్నారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం కూడా వాటిల్లింది. అటు కామారెడ్డి - నిజామాబాద్ మధ్య రైలు సర్వీసులు భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు 36 గంటల పాటు సాగిన మరమ్మతుల తర్వాత, రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా వరదల ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.












Click it and Unblock the Notifications
