ఆ డైలాగ్ 'రాజకీయం' కాదు: బాలకృష్ణ, యువతి కోసం ఇలా..., బాబు ముందే నినాదాలు
తన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో దేశం మీసం మెలేయాలన్న డైలాగ్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ గురువారం చెప్పారు.
విజయవాడ/హైదరాబాద్: తన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో దేశం మీసం మెలేయాలన్న డైలాగ్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ గురువారం చెప్పారు.
విజయవాడలోని ట్రెండ్ సెట్ థియేటర్లో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలయ్య, నటి శ్రియ, దర్శకుడు క్రిష్ కలిసి చూశారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఊహించిన దాని కంటే భారీ విజయం దక్కిందన్నారు.
సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని, దేశ విదేశాల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇరు రాష్ట్రాల సీఎంలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు. కాగా, బాలకృష్ణతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

సినిమా చూసిన బావ - బావమరిది
విజయవాడలోని ట్రెండ్ సెట్ సినిమా హాలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను చూశారు. బాలయ్య, శ్రియ, క్రిష్‌లతో కలిసి చంద్రబాబు సినిమా చూశారు. థియేటర్‌కు బాలయ్య రావడం చూసి అభిమానులు.. బాలయ్య జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
యువతి కోసం నిలుచున్న బాలయ్య
అంతకుముందు.. దర్శకులు క్రిష్, హీరో బాలయ్య హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బ్రమరాంబిక థియేటర్‌లో సినిమా చూశారు.బాలయ్య థియేటర్‌లోకి అడుగుపెట్టగానే అభిమానులంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. 'దేశం మీసం తిప్పుదాం' అంటూ అభిమానులంతా సినిమాలోని డైలాగులను అరిచి చెప్పారు. వారు సినిమా చూసేందుకు సన్నద్దమయ్యారు. థియేటర్లో కూర్చున్నారు.
అంతలో ఓ యువతి బాలయ్యకు తాను వీరాభిమాని అని, బాలయ్యతో ఫొటో దిగాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానని బాలకృష్ణ సెక్యురిటీతో చెప్పింది. వాళ్లు ఆ విషయాన్ని బాలయ్యకు చెప్పారు.
బాలయ్య అందుకు ఓకే చెప్పారు. అప్పుడప్పుడే వచ్చి కూర్చున్న బాలయ్య.. ఆ యువతి కోసం లేచి నిలబడ్డారు. ఆమె ఫొటోలు తీసుకున్నాక బాలయ్య మళ్లీ సీట్లో కూర్చున్నారు. ఈ మొత్తం దృశ్యాన్ని అక్కడున్న బాలయ్య అభిమాని ఒకరు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications