బాలాపూర్ లడ్డు కొత్త రికార్డు - ఏకంగా రూ 27లక్షలు..!!

గణేష్ నవరాత్రులు...నిమజ్జనం వేళ బాలాపూర్ లడ్డుకు ఉన్న ప్రత్యేకత వేరు. ప్రతీ ఏటా నిమజ్జనం ముందు నిర్వహించే వేలం పాటను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. గతేడాది(2022) వేలంలో ఈ లడ్డూ రూ.24.60 పలకగా.. ఈసారి కొత్త రికార్డు సొంతం చేసుకుంది. హైదరబాద్ లో గణపతి నిమజ్జనాల కోసం శోభా యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఈ సమయంలోనే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రూ 27 లక్షలు పలికింది. ఈ సారి బాలాపూర్ గణేష్ ఉత్సవ నిర్వాహకులు మరిన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.

గణేష్ నిమజ్జనం : భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే గణపతులు సాగరతీరం వైపు కదులుతున్నాయి. ప్రతీ ఏటా ఖైరతాబాద్ వినాయకుడుతో పాటుగా బాలాపూర్ లడ్డూ వేలానికి ప్రత్యేక ఉంది. నేటితో బాలాపూర్ లడ్డూ వేలానికి సరిగ్గా 30 ఏళ్లు పూర్తయింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.24,60,000లు బాలాపూర్ లడ్డూను స్థానికులే దక్కించుకోగా.. ఈ సారి లడ్డూ ధర కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ ఏడాది రియల్ వ్యాపారి దాసరి దయానంద రెడ్డి రూ 27 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన దయానందరెడ్డి ఈ ఏడాది దక్కించుకోవాలని చివరి వరకు వేలంలో నిలిచారు. ఎట్టకేలకు రూ 27 లక్షలకు దక్కించుకున్నారు.

Balapur Ganesh Laddu scripts new record in Aution, Dayananda Reddy got for rs 27 Lakhs

బాలాపూర్ లడ్డూ ఆక్షన్ : బాలాపూర్ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. 1994లో రూ. 450లతో మొదలయ్యింది ఈ లడ్డూ వేలం పాట. కరోనా సమయంలో తప్ప 28 ఏళ్ల పాటు ఈ వేలం పాట సాగింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ కొన్న వారి కొంగు బంగారంగా భావిస్తారు. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట తెలుగు రాష్ట్రాల్లోనే ఆసక్తిని పెంచుతోంది. 2015లో బాలాపూర్ లడ్డూ రూ. 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10.32 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది వేలం పాటలో 36 మంది పోటీ పడ్డారు. కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి ఆ లడ్డూను సీఎంకు అందించారు.

వేలంలో రికార్డు ధర : మరికాసేపట్లో బాలపూర్ గణేషుడు శోభాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేషుడిని వాహనంపైకి ఎక్కించారు. బాలపూర్ గ్రామంలో ఊరేగించనున్నారు. 2, 3 గంటల వరకు గణేషుడి ఊరేగింపు కొనసాగనుంది. ఊరు బొడ్రాయి వద్దకు వచ్చాక ప్రత్యేక పూజలు చేసి వేలం పాట స్టార్ట్ చేస్తారు. మేళ తాళాలతో బాలాపూర్‌ గణేషుడిని ఊరేగిస్తున్నారు నిర్వాహకులు. గణేషుడిని చూసేందుకు భారీగా చేరుకుంటున్నారు భక్తులు. అయితే, ఈ సారి లడ్డూ వచ్చిన వారి, తీసుకున్న వారి పేర్లను వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయనున్నారు. అటు సాగర తీరం వైపు గణేష్ విగ్రహాలు తరలి వస్తున్నాయి. రేపు ఉదయం వరకు గణేష్ నిమజ్జనం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో నగర వాసులు నిమజ్జనం వీక్షించేందుకు తరలి వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+