Singareni: సింగరేణి సంస్థ ఛైర్మన్‍గా బాలరామ్ నాయక్..
సింగరేణి సంస్థ ఛైర్మన్ గా బాలరామ్ నాయక్ కు నియమించారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవి కాలం ముగియడంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన స్థానంలో బలరాం నాయక్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాలరామ్ నాయక్ సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బలరాం నాయక్ సింగరేణి ఫైనాన్స్ అండ్ వెల్ఫేర్ బాధ్యతలతో పాటు సీఎండీగా అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా ఉన్నారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుధీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు.

శ్రీధర్ హయాంలో సింగరేణి అనేక విజయాలు సాధించడంతో విమర్శలు కూడా ఎదుర్కొంది. కేంద్రం శ్రీధర్ వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీధర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం అతన్ని కొనసాగించింది. శ్రీధర్ తీరుపై మొదటి నుంచి విపక్షాలు, కార్మిక సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. కార్మికులు కూడా శ్రీధర్ తొలగించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శ్రీధర్ పై బదిలీ వేటు వేసింది. ఇంకా చాలా శాఖల్లో పలువురు ఐఏఎస్ లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యం నవీన్ మిట్టల్ పై భారీగా ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications