బద్నాం చేయాలని పచ్చ పత్రికల ప్రయత్నం: ఎంపి బాల్క సుమన్
హైదరాబాద్: రాష్ట్ర రైతుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
పచ్చ పత్రికలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నా రైతుల ఆత్మహత్యల కింద చేరుస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతులు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దవని కోరుతున్నామని చెప్పారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కృషిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించడం గొప్ప నిర్ణయమని అన్నారు. కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications