కళాశాల నుండి బండి భగీరథ్ సస్పెండ్.. సోషల్‌మీడియాలో బండి సంజయ్ తనయుడి మరో వీడియో!!
కరీంనగర్ ఎంపీ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇప్పుడు టాక్ ఆఫ్ తెలంగాణాగా మారాడు. బండి సంజయ్ కుమారుడు చేసిన పని ఇప్పుడు బండి సంజయ్ కు తలనొప్పిగా మారింది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైదరాబాద్లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న విషయం తెలిసిందే. బండి భగీరథ్ తన జూనియర్ విద్యార్థిని బండ బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

ఇంకో విద్యార్థిని కొడుతున్న బండి సంజయ్ కొడుకు మరో వీడియో వైరల్
అయితే ఆ వీడియో పాత వీడియో అని, ఆ వీడియోలో బాధితుడుగా ఉన్న విద్యార్థి బండి భగీరథ్ కు ప్రస్తుత మంచి స్నేహితుడని క్లారిటీ కూడా వచ్చింది. ఇదిలా ఉండగానే బండి భగీరథ్ కు కు సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరొక విద్యార్థిని తన గ్రూప్ సభ్యులతో కలిసి వెళ్లి బండి భగీరథ్ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్న మరొక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం బండి భగీరథ్ పై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.

భగీరథ్ పై వేటు వేసిన కాలేజ్ యాజమాన్యం
పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో పాటుగా, భగీరథ్ పై వేటు వేసింది. భగీరథను కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు బండి భగీరథ్ పై ఐపీసీ సెక్షన్లు 341, 323,, 504, 506, 34 కింద కేసులు నమోదు చేశారు. ఇక బండి భగీరథ్ కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన తొలి వీడియోకు సంబంధించి, బాధితుడు తాను తప్పు చేయడం వల్లే, బండి భగీరథ్ అలా కొట్టాడని, అందులో భగీరథ్ తప్పేమీ లేదని వీడియో సందేశాన్ని పంపి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ వివాదం సమసిపోతుంది అనుకున్న క్రమంలో మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు బండి భగీరథ్ ఎలాంటి వాడు అన్న చర్చకు కారణంగా మారింది.
కళాశాల నుండి బండి భగీరథ్ సస్పెండ్ ..
ఇక బండి భగీరథ్ తాగుబోతు, దాదా గిరి చేస్తాడు అంటూ రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువగా మారడం వెరసి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై చర్యలకు ఉపక్రమించారు కళాశాల యజమాన్యం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను కళాశాల నుండి సస్పెండ్ చేశారు. బాగా ఆవేశపరుడిగా బండి భగీరథ్ జూనియర్లపై దాడులు చేస్తున్నట్టు ఆ వీడియో ల ఆధారంగా చర్చ జరుగుతుంది. ఎవరైనా, ఏమైనా తప్పులు చేస్తే శిక్షించటానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది కానీ రౌడీలా బండి కొడుకు ఇలా దాడులు చెయ్యటం ఏమిటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్ బండి సంజయ్ ను ఇబ్బందికి గురి చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చెయ్యటానికి ఆయుధంగా మారింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications