డ్రగ్స్ బానిస.. నమూనాలిస్తే నిరూపిస్తా.. కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్

ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ ను, కేటీఆర్ ను, కవితను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్ టిల్లు... డ్రగ్స్ బానిస, నమూనాలు ఇస్తే అంతా నిరూపిస్తా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. కేటీఆర్ రెండు వెంట్రుకలు ఇస్తే చాలు డ్రగ్స్ కథ బయట పడుతుందని అన్నారు. కేటీఆర్ కు రక్తం, వెంట్రుక నమూనాలు ఇచ్చే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. కవితను సైతం టార్గెట్ చేసిన బండి సంజయ్ లక్ష కోట్ల లిక్కర్ దందా కవిత చేసిందని ఆరోపణలు గుప్పించారు.

ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలీదు

ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలీదు

తాను తంబాకు తింటానని పచ్చి అబద్ధాలు చెప్పాడని, తాను ఏ పరీక్షకైనా సిద్ధమని పేర్కొన్న బండి సంజయ్, డ్రగ్స్ విషయంలో పదే పదే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలీదు అని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగుళూరు డ్రగ్స్ కేసులు మూయించింది అందులో కేసీఆర్ ఫ్యామిలీ ఉన్న కారణంగానే అన్నారు బండి సంజయ్. అంతేకాదు హైదరాబాద్, బెంగుళూరు డ్రగ్ కేసులను రీ ఓపెన్ చేయాల్సిందేనని బండి సంజయ్ పేర్కొన్నారు.

లిక్కర్ దందా చేసిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ యత్నాలు

లిక్కర్ దందా చేసిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ యత్నాలు

జీ-20 నిర్వహణ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గు చేటు బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను విమర్శించారు. దేశంలోని అన్ని పార్టీలు, అందరు సీఎంలు వెళ్లినా ... కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో సమాధానమివ్వాలని బండి సంజయ్ ప్రశ్నించారు. అందరూ జీ-20 నిర్వహణ సమావేశానికి వెళితే కేసీఆర్ మాత్రం ఆ సమయంలో బిడ్డను లిక్కర్ దందా కుంభకోణం నుండి ఎట్లా కాపాడుకోవాలి అన్న దానిపై లాయర్లతో మంతనాలు జరుపుతున్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశారు. జి 20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్ కు ఇక్కడ పీకే పనేముంది? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగ సారా దందా చేసిన బిడ్డను కాపాడుకునేందుకే... కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.

కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేస్తే... తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలా?

కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేస్తే... తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలా?

కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేస్తే... తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ దందా చేస్తే.. దర్యాప్తు సంస్థలు గుంజుకు పోవా? అన్న బండి సంజయ్, దానికి తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టటం దేనికో చెప్పాలని ప్రశ్నించారు. లిక్కర్ దందాలో కవిత ఇప్పటివరకు 10 ఫోన్లను ధ్వంసం చేసింది అన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుందని, అవినీతిలో అయ్యకు తగ్గ బిడ్డగా కవిత గుర్తింపు పొందిందని బండి సంజయ్ విమర్శించారు.

కవితను అరెస్టు చేస్తే... రాష్ట్రంలో ప్రజలు ధర్నా చేయాలా?

కవితను అరెస్టు చేస్తే... రాష్ట్రంలో ప్రజలు ధర్నా చేయాలా?


లిక్కర్ దందాలో అడ్డంగా దొరికిన కవితను అరెస్టు చేస్తే... రాష్ట్రంలో ప్రజలు ధర్నా చేయాలా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడు ప్రజలంతా జాగృతం కావాలి... చైతన్యవంతులు కావాలి అన్న బండి సంజయ్ మునుగోడులో దొంగ ఓట్లతో టిఆర్ఎస్ గెలిచింది. అది గెలుపే కాదన్నారు. మునుగోడులో నైతిక గెలుపు, నిజమైన గెలుపు బిజెపి దే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+