Bandi Sanjay: తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి.. బండి సంజయ్..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం కేంద్రాల్లో వడ్లు తడిసిపోయినట్లు చెప్పారు. తడిసిన వడ్లను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్లపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యం దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు.వెంటనే తడిసిన ధాన్యం తో సహా రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.వడ్లు అమ్ముకున్న రైతులకు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథమన్న కాంగ్రెస్.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కేసీఆర్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ డ్రామాలాడుతుందన్నారు. పంట నష్టపోతే పరిహారం ఇప్పటికీ అందని దుస్థితి నెలకొందన్నారు. కరీంనగర్ లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి దొరకడం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెబుతున్నారని గుర్తు చేశారు. అలాగే
25 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమన్నారు. బీజేపీ 370 సీట్లకు పైగా గెలవడం పక్కా అని అన్నారు.












Click it and Unblock the Notifications