• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హోంమంత్రి మహమూద్ అలీ రాజీనామా చేయాలి-ఒక వర్గానికే కొమ్ముకాసే మంత్రి అవసరం లేదు : బండి సంజయ్

|

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో బాలిక హత్యాచార ఘటనకు నైతిక బాధ్యత వహించి హోంమంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఒకవర్గానికే కొమ్ము కాసే హోంమంత్రి రాష్ట్రానికి అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 17వ రోజు మెదక్ జిల్లాలో సంజయ్ మాట్లాడారు.

అంతకుముందు,ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించారు బండి సంజయ్.'హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం హేయమైనది. ఈ దురాగతానికి ఒడిగట్టిన నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలి. టిఆర్ఎస్ పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఆదాయం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తూ యువకులను మద్యానికి బానిసలుగా చేస్తున్నారు. మద్యం తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి పసిపిల్లలపైన అత్యాచారాలు చేస్తుండటం దారుణం. ఈ దారుణానికి ప్రభుత్వ వైఫల్యాలే కారణం. ప్రభుత్వానికి పసిపిల్లల ఉసురు తగలక మానదు.' అని ఫైర్ అయ్యారు.

bandi sanjay demands to resign home minister mahmood ali over girl rape case

హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల గిరిజన బాలిక శనివారం(సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే పోలీసులు క్లూస్ టీమ్ పలు వివరాలు సేకరించారు.

  అప్రతిహతంగా కొనసాగుతున్న బీజేపి ఛీఫ్ బండి సంజయ్ యాత్ర!!

  ఈ ఘటనలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులెవరూ ఇంతవరకూ పరామర్శించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కనీస స్పందన కూడా లేదు. బాలిక గిరిజన వర్గానికి చెందినది కాబట్టే ప్రభుత్వం ఈ వివక్ష చూపిస్తోందని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే అట్టడుగు కులాల నుంచి తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇప్పటివరకూ పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  English summary
  BJP state president Bandi Sanjay has demanded the resignation of Telangana Home Minister Mahmood Ali. He demanded that home minister should take moral responsibility for the murder of the girl in Saidabad, Hyderabad
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X