కరీంనగర్ జైల్లో కేసీఆర్ కోసం ప్రత్యేక గది ఏర్పాటన్న బండి సంజయ్.!ఆ గదిని వెంటనే పరిశీలిస్తామన్న కాంగ్రెస్.!

కరీంనగర్/హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కోసం జైల్లో ప్రత్యేక గదిని తయారు చేస్తున్నామని బీజేపి తెలంగాణ అద్యక్ష్యుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బండి సంజయ్ వ్యాఖ్యలకు అనుగుణంగా జైల్లోని ఆ గది పరిశీలించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆసక్తికనబరుస్తోంది. ఇదే అంశంపైన, బండి సంజయ్ ప్రకటన పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాయువేగంతో స్పందించింది.

 కరీంనగర్ జైల్లో కేసీఆర్ కు ప్రత్యేక గది..బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

కరీంనగర్ జైల్లో కేసీఆర్ కు ప్రత్యేక గది..బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..


కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ మరియు కాంగ్రెస్ ప్రతినిధి బృందం 29 ఆగస్టు సోమవారం ఉదయం కరీంనగర్ జైలును సందర్శించి బండి సంజయ్ పేర్కొన్నట్టు సీఎం చంద్రశేఖర్ రావు నూతన జైలు గదిని పర్యవేక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు శర వేగంగా వాడివేడిగా మారుతున్నాయి. శనివారం వరంగల్లో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కరీంనగర్ జైల్లో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కోసం జైటు గది తయారు చేశామని చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.

 ఆ గదిని పరిశీలిస్తాం.. సౌకర్యాల గురించి ప్రజలకు వివరిస్తామన్న కాంగ్రెస్

ఆ గదిని పరిశీలిస్తాం.. సౌకర్యాల గురించి ప్రజలకు వివరిస్తామన్న కాంగ్రెస్

బండి సంజయ్ వ్యాఖ్యల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జైలును 29 ఆగస్టు సోమవారం ఉదయం సందర్శించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొరకు బండి సంజయ్ తయారు చేయించినటువంటి జైల్లోని గదిని మరియు ఆ గది ప్రత్యేకతలను పరిశీలించి వాస్తవ అవాస్తవాలను ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నట్టు కరీంనగర్ కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలు బండి సంజయ్ కాకతాళీవయంగా చేసారా లేక నిజంగా ఇటువంటిది ఏమైనా ఉందా ప్రజలకు చెప్పే ఉద్దేశంతోనే ఈ సందర్శన చేస్తున్నట్టు వివరిస్తున్నారు టీపిసిసి నేతలు.

 కేసీఆర్ ను రెండేళ్లుగా జైలుకు పంపుతామంటున్న బీజేపి.. నిజనిర్ధారణ కోసం జైలు సందర్శన అంటున్న టీపిసిసి

కేసీఆర్ ను రెండేళ్లుగా జైలుకు పంపుతామంటున్న బీజేపి.. నిజనిర్ధారణ కోసం జైలు సందర్శన అంటున్న టీపిసిసి

గత రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును జైల్లో పెడతాం, త్వరలో సీఎం చంద్రశేఖర్ రావును జైలుకు పంపుతాం అని ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ మాటల్లో వినిపిస్తూనే ఉందన్నారు కాంగ్రెస్ నాయకులు. తాజాగా ఇదే అంశాన్ని మళ్లీమళ్లీ చెబుతున్న బండి సంజయ్ ఇప్పుడు ఏకంగా వరంగల్ సభలో కరీంనగర్ జైల్లో గదినే తయారు చేసామని ప్రజలకు చెప్పడం, అందులో నిజానిజాల వెలికితీత కోసమే తాము సన్నాహాలు చేస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు.

 ఒక దెబ్బ.. రెండు పిట్టలు.. కాంగ్రెస్ అనూహ్య వ్యూహం.

ఒక దెబ్బ.. రెండు పిట్టలు.. కాంగ్రెస్ అనూహ్య వ్యూహం.

.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల సందర్భంగా సీఎం చంద్రశేఖర్ రావు జైలు గది ప్రత్యేకతలు, ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ లేదా జైలు గది ప్రత్యేకతలు ఏమిటి ఎలా తయారు చేస్తున్నారు.? అందులో టీవి, ఇంటర్ నెట్ సౌకర్యం, ఇతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆ గదిని చూసేందుకు వెళ్తున్న సందర్భంగా మీడియా కూడా తమ వెంట రావాలని టీపిసిసి నేతలు విజ్ఞప్తి చేసారు. కరీంనగర్ జైలుకు మీడియా వస్తే వాస్తవాలు ప్రజలకు స్పష్టం తెలిసే అవకాశం ఉంది కాబట్టి ప్రసార మాద్యమాలు సానులకూంగా స్పందించాలని కరీంనగర్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+