కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్‌లో ఉన్నారని చెప్పలేదు, మునుగోడు బీజేపీదే: బండి సంజయ్
హైదరాబాద్: తాను చేసిన వ్యాఖ్యలను మీడియాలో మరోలా ప్రసారం చేయడం సరికాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నియోజకవర్గంలోని భట్టుపల్లి గ్రామానికి చేరుకున్న బండి సంజయ్‌కి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.

బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరికలు
అనంతరం భట్టుగూడెం వద్ద మూసీ నది లోలెవల్ బ్రిడ్జి, పక్కనే ఉన్న పంట పొలాలను బండి సంజయ్ పరిశీలించారు. పలువురు గ్రామస్థులు తమ సమస్యలను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరి సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని భట్టుగూడెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం పాదయాత్ర శిబిరం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో బండి సంజయ్ మాట్లాడారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్‌లో ఉన్నారని చెప్పలేదన్న బండి
'కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాతో టచ్‌లో ఉన్నారని నేను అనలేదు. అనని మాటను అన్నట్టు బ్రేకింగ్స్ పెట్టొద్దని మీడియాకు నా విజ్ఞప్తి. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని మోడీ. అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోడీని కలుస్తూ ఉంటారు' అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మునుగోడు ఉపఎన్నికలో గెలిచేది బీజేపీనే: బండి సంజయ్
మరోవైపు, మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీనే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్ అని అనారు. దుబ్బాక, నాగార్జుసాగర్, హుజూరాబాద్ ఉపఎన్నికల సమయాల్లో ఆరు నెలల చొప్పున కేసీఆర్ టైంపాస్ చేశారని.. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక పేరుతో మళ్లీ ఆరు నెలలు టైంపాస్ చేస్తారని విమర్శించారు.












Click it and Unblock the Notifications