వెంటాడుతున్న బండి - ఆధారాలతో సహా : టీఆర్ఎస్ ప్రభుత్వంపై 86 పిటీషన్లు..!!
టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా బీజేపీ కొత్త అడగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తూ వచ్చిన బీజేపీ..ఇక నుంచి పక్కా ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా.. తమకు కావాల్సిన సమచారం ప్రభుత్వం నుంచే సేకరిస్తోంది. ఇందు కోసం ఆర్టీఐ చట్టం కింద ఏకంగా 86 అంశాల పైన దరఖాస్తు చేసింది.
ఎనిమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు.. అమలు చేసినవి ..చేయల్సినవి వంటి అంశాలతో పాటుగా ప్రభుత్వ ఖర్చుల పైనా సమాచారం కోరింది. ఆధారాలతో సహా, పకడ్భందీగా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే లక్ష్యంగా వీటి పైన సమాచారం కోరామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మీడియా సంస్థలక ఇచ్చి ప్రకటనల విలువ పైన లెక్కలు ఇవ్వాలని దరఖాస్తు చేసారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ
2 జూన్ 2014 నుండి 2 జూన్ 2022 వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా, వివిధ సమావేశాల్లో, సభల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల వివరాలు కోరింది. 2 జూన్ 2014 నుండి 2 జూన్ 2022 వరకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు.. ఎన్ని నెరవేర్చలేదు..వంటి వివరాలతో పాటుగా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో చెప్పాలని అభ్యర్ధించారు.
ముఖ్యమంత్రి శాసనసభ, శాసనమండలిలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల వివరాలను పార్టీ కోరింది. ప్రగతి భవన్ నిర్మాణానికి చేసిన ఖర్చు.. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్నికసార్లు రాష్ట్ర సచివాలయానికి వచ్చి తమ విధులను నిర్వర్తించారో పూర్తి సమచారాన్ని ఇవ్వాలని బీజేపీ ఆర్టీఐ ద్వారా కోరింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం ఎన్నిరోజులు హైదరాబాదులోని అధికార నివాసంలో బసచేశారు, ఎన్నిరోజులు వ్యవసాయక్షేత్రంలో బసచేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని బీజేపీ కోరింది.

ఉద్యోగాలు- కేటాయింపుల వారీగా
రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం ఎన్ని నోటిఫికేషన్లు జారీచేసిందనే వివరాలను సైతం బీజేపీ కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించారు.. ఆ పర్యటనలకు ఎంత ఖర్చు అయింది.. వీటికి సంబంధించి పూర్తిసమాచారాన్ని ఇప్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు తీసుకున్న జీతభత్యాలు ఎంత? దీనికి సంబంధించి పూర్తివివరాలు ఇవ్వాలని తమ దరఖాస్తులో కోరారు.
2 జూన్ 2014 నుండి 2 జూన్ 2022 వరకు ఎస్సీ, ఎస్టీ పేదలకు భూపంపిణీకి ఎన్ని నిధులు కేటాయించారు. అందులో ఎన్ని నిధులు దీనికోసం ఖర్చు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించాలని విన్నవించారు.అధికారంలో వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం ఎంతమంది రైతులకు లక్షరూపాయల రుణమాఫీ పైనా సమాచారం కోరింది.

బీసీ - ఎస్సీలకు కేటాయింపుల పైనా
దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించాలని కోరారు. బీసీ సామాజికవర్గాలకు సబ్సిడీ రుణాల కోసం 2014 నుండి 2022 వరకు ఎంత బడ్జెట్ కేటాయించారు.. అందులో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో సంవత్సరాలవారీగా సమాచారాన్ని ఇప్పించాలని బీజేపీ నేతలు పిటీషన్లు దాఖలు చేసారు.
2 జూన్ 2014 నుండి 2022 వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులు ఎన్ని.. అందులో చేసిన ఖర్చు ఎంతో చెప్పటంతో పాటుగా.. దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని సంవత్సరాల వారిగా ఇప్పించాలని అభ్యర్ధించారు. ఇలా మొత్తం 86 అంశాల పైన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసారు. వీటి ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ నేతలు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications