నన్ను ఓడించేందుకు ఆ రెండు పార్టీల మధ్య డీల్: బండి సంజయ్

కరీంనగర్: నేడు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న నిధులే కారణమని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు.
బీఆర్ఎస్‌ ప్రభుత్వం గ్రామాలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, కేంద్ర నిధులను పక్కదారి మళ్లించిందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ కెప్టెన్, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అని, మరి కాంగ్రెస్‌కు కెప్టెన్, ప్రధాని అభ్యర్థి ఎవరని బండిసంజయ్ ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు రాజకీయాలతో ముడిపడినవి కాదని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మోడీనే మళ్లీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Bandi Sanjay slams congress and brs in husnabad bjp workers meeting

అంబేడ్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే.. తాను కొట్లాడినట్లు బండి సంజయ్ చెప్పారు. దీనిపై ఏ కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించలేదన్నారు. ఇవాళ కేసీఆర్, కేటీఆర్ బజారులో పడ్డారంటే దానికి కారణం తన పోరాటమేనని బండి సంజయ్ తెలిపారు. అందుకే తన మీద 109 కేసులు ఉన్నాయన్నారు.

భారత రాష్ట్ర సమితి అంటే దేశం అంతా పోటీ చెయ్యాలని.. కానీ ఇక్కడే వాళ్లకు అభ్యర్థి లేడని ఎద్దేవా చేశారు బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సర్పంచులను బిచ్చగాళ్లను చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిందని దుయ్యబట్టారు.

దేశాన్ని 57 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.1,100 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. పదేళ్లలో మోడీ ప్రభుత్వం రూ.59,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో 8 మంది ఎస్టీ, 12 మంది ఎస్సీ, 20 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు.

ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ మంత్రులు ఎంత మంది ఉన్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడానికి వీలు లేదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్కటై అడ్డుకునే ప్రయత్నం చేశాయని ధ్వజమెత్తారు. ఇవాళ బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపాయికారీ ఒప్పందం చేసుకొని తనను కరీంనగర్‌లో ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+