వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కల్పించాలన్న బండి సంజయ్.!సానుకూలంగా స్పందించిన యూజీసీ సెక్రటరీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వతంత్ర్యతను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేనిదే విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అందులో భాగమేనని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించచడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు బండి సంజయ్.

శాతవాహన వర్శిటీకి 12-బి హోదా ఇవ్వండి.. యూజీసీ సెక్రటరీ కోరిన బండి సంజయ్

శాతవాహన వర్శిటీకి 12-బి హోదా ఇవ్వండి.. యూజీసీ సెక్రటరీ కోరిన బండి సంజయ్

శుక్రవారం తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ న్యూఢిల్లీలో యూజీసీ కార్యదర్శి, సీవీవో రజ్నీస్ జైన్ ను కలిశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని శాతవాహన యూనివర్శిటీకి 12-బి హోదాను కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. శాతవాహన వర్శిటీకి 12(బి) హోదా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విశ్వవిద్యాలయానికి కావాల్సిన నిధులు సమకూరడం లేదని పేర్కొన్నారు. మారిన నిబంధనలతో యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు, అందుకోసం వీలైనంత త్వరగా 12-బి హొదా కల్పిస్తే శాతవాహన వర్సిటీలో నెలకొన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని వివరించారు.

బండి సంజయ్ వినతికి స్పందించిన యూజీసీ.. అంశాలు పరిశీలిస్తామన్న యూజీసీ సెక్రెటరీ

బండి సంజయ్ వినతికి స్పందించిన యూజీసీ.. అంశాలు పరిశీలిస్తామన్న యూజీసీ సెక్రెటరీ

శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కల్పించే విషయంలో తన వినతి మేరకు ప్రత్యేకంగా కమిటీని నియమించడంపట్ల యూజీసీ కార్యదర్శి రజ్నీస్ జైన్ కు ధన్యవాదాలు తెలిపారు బీజేపి రాష్ట్ర అధ్యక్షడు, ఎంపీ బండి సంజయ్. ఆ కమిటీ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తోందని, వెంటనే యూనివర్శిటీకి 12-బి హోదా ఇవ్వాలని కోరారు. ఒకవేళ యూనివర్శిటీలో ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే వాటిని సరిదిద్ధుకుని యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ పేర్కొన్నారు.

వర్శిటీల స్వతంత్రతను దెబ్బతీస్తున్న ప్రభుత్వాలు.. జోక్యం చేసుకోవాలన్న సంజయ్

వర్శిటీల స్వతంత్రతను దెబ్బతీస్తున్న ప్రభుత్వాలు.. జోక్యం చేసుకోవాలన్న సంజయ్

బండి సంజయ్ వినతిపట్ల సానుకూలంగా స్పందించిన రజ్నీస్ జైన్ వెంటనే రికగ్నైజేషన్ కమిటీ ఛైర్మన్ తో ఫోన్ లో మాట్లాడారు. శాతవాహన వర్శిటీకి 12-బి హోదా ఇచ్చే విషయంపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రికగ్నైజేషన్ కమిటీ నివేదిక అందిన వెంటనే శాతవాహన వర్శిటీకి 12-బి స్టేటస్ కల్పిస్తామని బండి సంజయ్ కు రజ్నీస్ జైన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ యూజీసీ కార్యదర్శి, సీవీవో రజ్నీస్ జైన్ కు ధన్యవాదాలు తెలిపారు.

Recommended Video

Weather Forecast : New Low Pressure, Heavy Rains Again In AP & TS || Oneindia Telugu
రికగ్నైజేషన్ కమిటీతో చర్చలు.. అనంతరం నిర్ణయం తీసుకుంటామన్న యూజీసీ సెక్రెటరీ

రికగ్నైజేషన్ కమిటీతో చర్చలు.. అనంతరం నిర్ణయం తీసుకుంటామన్న యూజీసీ సెక్రెటరీ

యూజీసీ సెక్రటరీ, సీవోవో రజ్నీస్ జైన్ తో భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీకి 12(బి) స్టేటస్ లభించినట్లయితే అధ్యాపక సిబ్బందితో పాటు, బోధనేతర సిబ్బంది నియామకాల్లో సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. అంతేకాకుండా యూనివర్సిటీకి అవసరమైన నిధులు సమకూరుతాయని పేర్కొన్నారు. యూనివర్సిటీకి విద్యార్థుల సంఖ్యపెరగడంతో పాటు నాణ్యమైన విద్యను అందించొచ్చని బండి సంజయ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

English summary
On Friday, Telangana BJP president Bandi Sanjay Kumar met UGC secretary and CVO Rajneesh Jain in New Delhi. A petition has been filed seeking 12-B status for Satavahana University in Karimnagar Parliamentary constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X