వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక కాళేశ్వరం ఇష్యూ.. ప్రాజెక్ట్ విజిట్ చేస్తాం, పర్మిషన్ ఇవ్వండి, సీఎస్‌కు బండి సంజయ్ లేఖ

|
Google Oneindia TeluguNews

జనాలతో బండి సంజయ్ మమేకం అవుతున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడు విడతలుగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన.. అంతకుముందు సభలు, సమావేశాలు.. చేరికల సందర్భంగా బహిరంగ సభలు నిర్వహిస్తోంది. జేపీ నడ్డా, అమిత్ షా లాంటి అగ్ర నేతలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తమ పార్టీ బలోపేతం గురించి కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Recommended Video

టాలీవుడ్ పై బీజేపీ కన్నేసిందా..? *Politics | Telugu OneIndia
జనంలో బండి సంజయ్..

జనంలో బండి సంజయ్..

ఇక బండి సంజయ్ కూడా అంతే.. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రను మూడు విడతలుగా చేశారు. ఆ తర్వాత జనంతో దగ్గరవ్వడం.. సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇటీవల చేరికల సందర్భంగా బహిరంగ సభలు.. అగ్ర నేతల రాకతో బీజేపీలో జోష్ నింపింది. ఇప్పుడు బండి సంజయ్ కొత్తగా మరో ఇష్యూను ముందట వేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తామని చెబుతున్నారు. అందులో భారీగా అవినీతి జరిగిందిన బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ప్లీజ్.. పర్మిషన్ ఇవ్వండి

ప్లీజ్.. పర్మిషన్ ఇవ్వండి

కాళేశ్వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శించేందుకు అనుమ‌తి ఇవ్వాలని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు బండి సంజ‌య్ లేఖ రాశారు. త‌మ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్ర‌జా ప్ర‌తినిధులు, సాగునీటి పారుద‌ల రంగం నిపుణుల‌తో కూడిన 30 మంది ప్ర‌తినిధి బృందం ప్రాజెక్టు విజిట్ చేస్తామని తెలిపారు. సెప్టెంబ‌ర్ ఫస్ట్ వీక్‌లో వెళ్లాలని అనుకుంటున్నామని లేఖ‌లో ప్రస్తావించారు.

పరిశీలన

పరిశీలన

కాశేళ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, వ‌ర‌ద‌ల్లో ప్రాజెక్టు మున‌క‌పై ప‌రిశీలిస్తామని సంజ‌య్ తెలిపారు. దీంతో ప్రాజెక్టుపై త‌మ‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తి చేసుకుంటామని పేర్కొన్నారు. 1998లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల వల్ల శ్రీశైలం ప్రాజెక్టు ట‌ర్బైన్లు దెబ్బ తినడంతో వాటిని ప‌రిశీలించేందుకు అప్ప‌టి ప్ర‌భుత్వం విప‌క్షాల‌కు అనుమ‌తి ఇచ్చిన విష‌యాన్ని బండి సంజ‌య్ గుర్తు చేశారు. త‌మ బృందంతోపాటు ప్ర‌భుత్వ సాగునీటి శాఖ అధికారులను పంపి త‌మ అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని సీఎస్‌ను కోరారు.

English summary
telangana bjp chief bandi sanjay write letter to cs somesh kumar for visit kaleshwaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X