విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనలో కొత్తకోణం, సీసీటీవి పుటేజీ ఆధారంగా..

మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల మిస్టరీలో కొత్త కోణం వెలుగు చూసింది. దర్యాప్తులో భాగంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల మిస్టరీలో కొత్త కోణం వెలుగు చూసింది. దర్యాప్తులో భాగంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

యూత్ కాంగ్రెస్ నాయకుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో మూడు రోజులుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. అయితే బాధిత కుటుంబం చెబతున్న విషయాలకు సంఘటన స్థలంలో చోటుచేసుకొన్న ఘటనలకు పొంతన లేదని భావించారు.

అయితే ఈ కేసును లోతుగా పరిశీలించిన మీదట కిరాయి హంతక ముఠా విక్రమ్‌గౌడ్‌పై కాల్పులకు దిగిందా అనే కోణంలో కూడ విచారిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి సీసీ టీవి పుటేజీ ఆధారంగా ఓ ఆధారాన్ని గుర్తించారు పోలీసులు

కాల్పులు జరిగిన తర్వాత విక్రమ్‌గౌడ్ ఇంటికి సమీపం నుండి నల్లరంగు కారు వెళ్ళినట్టుగా గుర్తించారు పోలీసులు.అంతేకాదు కాల్పులు జరిగిన ముందు రోజే అనంతపురానికి చెందిన వారితో విక్రమ్‌గౌడ్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

ముగ్గురు అనుమానితులను అదుపులోకి

ముగ్గురు అనుమానితులను అదుపులోకి

విక్రమ్‌గౌడ్ కాల్పుల కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు యువకులు కాల్పులకు పాల్పడ్డారనే అంచనాకు పోలీసులు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే శాస్త్రీయంగా ఆధారాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు మరింత లోతుగా విచారణ చేసే అవకాశాలున్నాయి.

కాల్పులు జరిపారన్న విక్రమ్‌గౌడ్

కాల్పులు జరిపారన్న విక్రమ్‌గౌడ్

విక్రమ్‌గౌడ్ తనపై కాల్పులు జరిపారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ ఘటనపై రకరకాలుగా ప్రచారం సాగింది. విక్రమ్‌గౌడ్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదనే అభిప్రాయాలను కూడ వ్యక్తం చేశారు. పోలీసులు కూడ ఇదే కోణంలో దర్యాప్తును చేశారు. కానీ, ఈ విషయమై విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిపిన ప్రదేశాన్ని, ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయేందుకు ఉన్న మార్గాలపై కూడ ఆరాతీశారు.. మూడు రోజులుగా ఈ ఘటనపై విక్రమ్‌గౌడ్,. ఆయన భార్య షిఫాలీ కూడ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సీసీటీవి పుటేజీ ఆధారంగా విచారణ

సీసీటీవి పుటేజీ ఆధారంగా విచారణ

సిసిటీవి పుటేజీ ఆధారంగా పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన సమయంలో విక్రమ్‌గౌడ్ నివసిస్తున్న ఇంటి సమీపం నుండి ఓ నల్లరంగు కారు వెళ్ళడాన్ని సిసిటీవి పుటేజీలో పోలీసులు గుర్తించారు. ఈ పుటేజీ ఆధారంగా విచారణ జరిపారు. అంతేకాదు గురువారం నాడు పలుమార్లు విక్రమ్‌గౌడ్ అనంతపురానికి చెందినవారితో ఫోన్‌లో మాట్లాడినట్టుగా గుర్తించారు.

అనంతపురం లింకు కోణంలో విచారణ

అనంతపురం లింకు కోణంలో విచారణ

అనంతపురంతో లింకు కోణంలో పోలీసులు జరిపిన విచారణలో కొంత సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారని సమాచారం. అయితే ఈ ముగ్గురు ఇచ్చే సమాచారం ఆధారంగా విక్రమ్‌గౌడ్ కాల్పుల ఘటన ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+