అతి భారీవర్షాల హెచ్చరిక చేసిన బంగాళాఖాతం.. నేడు, రేపు బయటకు రాకండి!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే వరద ఉధృతి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నేడు ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల మేరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రేపు కూడా
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, హనుమకొండ, జనగామ, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. రేపు ఆదివారం కూడా కొన్ని జిల్లాలను అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రేపు ఈ జిల్లాలలో అతిభారీ వర్ష సూచన.. సాధారణం కంటే ఎక్కువ వర్షం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ తోపాటు మరికొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉంటే ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. సాధారణ వర్షపాతం 106 మిల్లీ మీటర్లే అయినప్పటికీ, 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అతి వర్షాల నేపధ్యంలో ప్రజలకు అలెర్ట్
ఇక అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఉంటే మంచిదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. పొలం పనులకు వెళ్ళే వ్యవసాయదారులు చెట్ల కింద నిలబడకూడదని చెబుతున్నారు. ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ లు మాట్లాడడం మంచిది కాదని సూచిస్తున్నారు. కరెంట్ స్తంభాలను ముట్టుకోవటం చేయరాదని, వర్షాకాలంలో చెరువులు, కుంటల వద్దకు వెళ్లకూడదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications