మరో ట్విస్ట్: ఫ్రెండ్ ను తారుస్తావా అంటూ శిరీష గొడవ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా మారేవాడు. అయితే ఈ కేసు తీవ్రతను గమనించి తనకు ఎదురయ్యే విపత్తును ముందుగానే ఊహించిన ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు కోర్టుకు రిమాండ్ డైరీని సమర్పించారు.ఈ మేరకు మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి, బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసుల విషయంలో వారి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు చెబుతున్న వాదనలతో ఏకీభవించడం లేదు. వీరిద్దరిది ఆత్మహత్య కాదు, హత్యేనని రెండు కుటుంబాల సభ్యుల అభిప్రాయపడుతున్నారు.

శాస్త్రీయంగా, టెక్నాలజీ సహయంతో కేసును చేధించినట్టుగా పోలీసులు ప్రకటించారు.అయితే ఇంకా కూడ వీరిద్దరి మరణాలపై అనేక అనుమానాలను రెండు కుటుంబాలకు చెందినవారు వ్యక్తం చేస్తున్నారు.

శిరీష ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరో వైపు ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిని హత్యచేశారని, మరో వైపు ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబసభ్యులు గుర్తుచేస్తున్నారు. అంతేకాదు రైటర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలను కూడ వారు ప్రస్తావిస్తున్నారు. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిని హత్య చేశారని శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలను వారు గుర్తుచేస్తున్నారు.ఈ మేరకు మీడియాలో వచ్చిన వార్తాకథనాలను వారు పదేపదే ప్రస్తావిస్తూనే ఉన్నారు.

శిరీషతో రాజీవ్ కు పరిచయమిలా

శిరీషతో రాజీవ్ కు పరిచయమిలా

బ్యూటీషీయన్ గా పనిచేసే శిరీషకు ఓ వేడుకలో రాజీవ్ పరిచయమయ్యాడు.అప్పటికే తాను నడిపే బ్యూటీపార్లర్ నష్టాలు రావడంతో రాజీవ్ తో కలిసిపనిచేసేందుకు ఆమె నాలుగేళ్ళ క్రితం రాజీవ్ వద్ద జాయిన్ అయింది.వారిద్దరి మధ్య శారీరక సంబంధం కొన్నాళ్ళపాటు కొనసాగింది.గత కొంతకాలంగా మాత్రం వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఎస్ఐ కోచింగ్ కోసం హైద్రాబాద్ కు వచ్చిన శ్రవణ్ తో శిరీషకు ఏడాదిన్నర క్రితం స్నేహం ఏర్పడింది. రాజీవ్, తేజస్వినిలు ప్రేమికులు. వీరిద్దరూ పెళ్ళిచేసుకొందామనుకొంటుండగా, శిరీషపై తేజస్వినికి అనుమానం వచ్చింది. ఆమెను దూరం పెట్టాలని రాజీవ్ పై ఒత్తిడి తెచ్చింది. ఆమె తన వద్ద పనిచేస్తోందంటూ రాజీవ్ చెప్పినా తేజస్విని నమ్మలేదు. ఆమెను అవమానపర్చేలా తిడుతూ తేజస్విని పోన్లు చేసేది, వాట్సాప్ లో మేసేజ్ లు పెట్టేది. అయినా తన మాట వినడం లేదని తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని ఆశ్రయించారు.

రిమాండ్ డైరీలో ఏముంది?

రిమాండ్ డైరీలో ఏముంది?

బ్యూటీషీయన్ శిరీష కేసులో కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉండేవాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలో పేర్కొన్నట్టుగా మీడియాలో వచ్చిన కథనాలు చెబుతున్నాయి. ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా తాను మారే అవకాశం ఉందని భావించిన ప్రభాకర్ రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొన్నాడని చెబుతున్నారు. ఈ నెల 12వ,తేది రాత్రి నుండి 13 వ,తేది ఉదయం రెండున్నర గంటల వరకు జరిగిన పరిమాణాలు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని దోషిగా వెలెత్తి చూపిస్తున్నాయని రిమాండ్ డైరీలో ఉన్నట్టుగా మీడియలో వార్తలు వెల్లువెత్తాయి.

ఆ రోజు ఏం జరిగిందంటే?

ఆ రోజు ఏం జరిగిందంటే?

ఈ నెల 12వ, తేది రాత్రి పదకొండున్నర గంటలకు రాజీవ్, శ్రవణ్ , శిరీషలు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు. అక్కడే శ్రవణ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శిరీష, రాజీవ్ లను పరిచయం చేశారు. నలుగురు మద్యం సేవించారు. వారి సమస్యను విన్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆ సమస్యను తనకు వదిలేయాలని కోరారు. రెండు పెగ్ ల మద్యం తాగిని రాజీవ్, శ్రవణ్ లు సిగరెట్ తాగేందుకు బయటకు వచ్చారు.అయితే శిరీష కూడ బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వారించాడు. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో సెక్స్ వర్కర్లుంటారు. వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రాజీవ్, శ్రవణ్ లకు సూచించారు. ఈ విషయమై శ్రవణ్ కూడ రాజీవ్ ను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. కానీ రాజీవ్ ఒప్పుకోలేదు. ఈ మాటలను శిరీష విన్నది.దీంతో అనుమానం వచ్చిన శిరీష తాను ఉన్న ప్రదేశాన్ని తన భర్తకు వాట్సాప్ ద్వారా లోకేషన్ తెల్లవారుజామున 1.48, 149 నిమిషాలకు రెండు దఫాలు పంపింది. అంతేకాదు రాజీవ్ కు కూడ రాజీవ్ నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అంటూ మేసేజ్ లు పెట్టింది.ఆ తర్వాత మళ్ళీ క్వార్టర్స్ లోకి వచ్చిన ఆ ముగ్గురు మద్యం సేవించారు. తర్వాత తిరిగి సిగరెట్ తాగేందుకు రాజీవ్ ను శ్రవణ్ బయటకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో రూమ్ లోనే ఉన్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీష పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.దీంతో ఆమె ప్రతిఘటించింది. సహయం కోసం వస్తే ఇలా చేస్తున్నారేమిటీ అంటూ ఆమె ఎస్ఐ పై ఆగ్రహన్ని ప్రదర్శించింది. అంతేకాదు ఏడుస్తూ అరిచింది. దీంతో రాజీవ్, శ్రవణ్ లు లోనికి వచ్చారు. ఈ మేరకు పోలీసులు రిమాండ్ డైరీలో పేర్కొన్నట్టుగా మీడియాలోకథనాలు వచ్చాయి.

మా లిమిట్స్ దాటారా అంటూ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆరా

మా లిమిట్స్ దాటారా అంటూ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆరా

అయితే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించడంతో ఖంగుతిన్న శిరీష గట్టిగా ఏడ్చింది. అరిచింది.ఈ అరుపులు క్వార్టర్ లో ఉన్న వారు ఎవరైనా వింటే ఇబ్బంది కలుగుతోందని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కూడ ఆందోళన చెందాడు. వెంటనే ఆమెను ఇక్కడి నుండి తీసుకెళ్ళాలని రాజీవ్, శ్రవణ్ లను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ఏంటీ రాజీవ్ ఎందుకుకొచ్చాం, ఇక్కడ జరుగుతున్న నాన్సెన్ ఏమిటీ అంటూ రాజీవ్ తో శిరీష గొడవపెట్టుకొంది. అంతేకాదు గట్టిగా అరిచింది. ఏడ్చింది.అయితే ఆమె ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో రాజీవ్ ఆమెపై చేయిచేసుకొన్నాడు. తెల్లవారుజామును రెండున్నరగంటలకు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ నుండి రాజీవ్, శ్రవణ్ , శిరీషలు బయలుదేరారు. నీ స్నేహితురాలిని వేశ్యగా చిత్రీకరిస్తావా అంటూ రాజీవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గజ్వేల్ వద్ద కారు స్లో కావడంతో శిరీష కారునుండి దిగేందుకు ప్రయత్నించింది. దీంతో రాజీవ్ శిరీష ను అసభ్యంగా తిడుతూ కారులోనే కొట్టాడు. వీరి కారు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ ను దాటారా లేదా అంటూ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శ్రవణ్ కు రెండుసార్లు పోన్లు చేశారు. ఈ ముగ్గురు 13వ, తేది తెల్లవారుజామున 3.45 నిమిషాలకు హైద్రాబాద్ లోని రాజీవ్ స్టూడియో ఉన్న అపార్ట్ మెంట్ కు చేరుకొన్నారు.

ఎస్ఐ పేరు ఇలా

ఎస్ఐ పేరు ఇలా

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి పేరును బయటకు తీసుకురావద్దని శ్రవణ్, రాజీవ్ లు ప్రయత్నించారు. అయితే అనూహ్యరీతిలో శిరీష ఆత్మహత్యచేసుకోవడంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి పేరును బయటకు రాకుండా చూడాలని రాజీవ్, శ్రవణ్ ల మధ్య ఒప్పందానికి వచ్చారు.అయితే శాస్త్రీయంగా కేసును పరిశోధించడంతో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి కి ఈ కేసుతో ఉన్న లింకు బయటకు వచ్చిందని పోలీసులు రిమాండ్ డైరీలో పేర్కొన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. తొలుత ఈ కేసును తప్పుదోవపట్టించేందుకు వారు ప్రయత్నించారని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఫోన్ లోకేషన్లతో టెక్నాలజీని ఉపయోగించి నిర్ధారణకు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు.ఈ మేరకు రిమాండ్ డైరీలో పోలీసులు ఈ అంశాలను ప్రస్తావించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Beautician Sirisha suicde case linked with Kukunoorpally Si Prabhakar Reddy, Hyderabad police submitted remand diary to court. so, Prabhakar reddy suicide said police.
Please Wait while comments are loading...