• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముందు మౌనం, రేప్ తర్వాత కలివిడి : ఇదీ శ్రీనివాస్ రెడ్డి నైజం, మనస్తత్వం అంచనా వేసిన ఖాకీలు

|

హైదరాబాద్ : అతడో కామరూప రాక్షసుడు. అమ్మాయిలు కనిపిస్తే చాలు, అనుభవించాల్సిందేనని భావిస్తాడు. నరనరాన కామంతో రగిలిపోయిన శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అతడి టూ వీలర్ ఎక్కారో ఇక అంతే సంగతులు. వారిని అనుభవించి, హతమార్చే వరకు నిద్రపోడు సైకో శ్రీనివాస్ రెడ్డి.

 కలువడు .. కలిస్తే ఇక అంతే ...

కలువడు .. కలిస్తే ఇక అంతే ...

స్వతహాగా శ్రీనివాస్ ఎవరితోనూ కలిసిపోడు. ఎవరికీ కనిపించడు. కానీ ఎవరిపైనైనా అఘాయిత్యానికి పాల్పడినప్పుడు మాత్రమే అందరితో మాట్లాడుతాడు. తనపై రాకుండా ఉండేందుకు మానవమృగం తెలివీ ఇది. గతనెల 25న శ్రావణికి లిఫ్ట్ ఇచ్చి అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. 26న ఒక్కసారి ఊరిలో ప్రత్యక్షమయ్యాడు. ఊరిలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే తాను కూడా ఆడాడు. తెల్లవారి స్కూల్ ఫ్రెండ్స్‌ పెళ్లికి కూడా వెళ్లాడు. విందులో పాల్గొని చిందేశి .. తాను హుషారుగా ఉన్నానని .. జరిగిన ఆకృత్యాలతో తనకు సంబంధం లేదన్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు. అయితే గతంలో ఎవరితో అంతగా కలువని శ్రీనివాస్ .. ఒక్కసారిగా ఫ్రీగా ఉండటంతో చిన్ననాటి స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు.

సైలెంట్ కిల్లర్ సైకో శీను

సైలెంట్ కిల్లర్ సైకో శీను

శ్రీనివాస్ ఎప్పుడూ సైలెంట్‌గా ఉండేవాడని అతని చిన్ననాటి స్నేహితులు చెప్తున్నారు. తమ క్లాస్‌లో 150 మంది ఉండేవారని .. ఎవరితోనూ కలిసిపోయేవాడు కాదని పేర్కొన్నారు. అంతగా చదివే వాడు కాదని .. టీచర్ కొడుతుంటే దెబ్బలు తినేవాడు కానీ అతని మొహంలో బాధ, భయం కనిపించేవి కాదని చిన్ననాటి సంఘటనలు గుర్తుచేశారు. దీనినిబట్టి చిన్ననాటి నుంచే శ్రీనివాస్‌ సైకోగా మారాడని స్పష్టమవుతోంది.

ఇలా వెలుగులోకి ...

ఇలా వెలుగులోకి ...

శ్రావణి మృతదేహం బయటపడటంతో మానవమృగం శ్రీనివాస్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు మూడు హత్యలు బయటపడగా .. ఇంకెంత మందిని మట్టుబెట్టాడోననే అనుమానం కలుగుతోంది. ఇటీవల కాలంలో జరిగిన ఆకృత్యాలకు సంబంధించి .. వెలుగులోకి రాని సంఘటనలు ఉండొచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు. లిఫ్టు మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ .. పలు ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. కర్నూలులో ఓ యువతిని హత్యచేసి పీపాలో కుక్కాడు. అంతేకాదు అతని ఫేస్ బుక్ ఖాతలో 631 స్నేహితుల్లో కేవలం 50 లోపే పురుషులు ఉన్నారు. మిగతా వారంతా యువతులే. అదీ కూడా వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ఆ పరిచయం కొద్దీ ఇదివరకు పనిచేసిన వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్‌లో కనిపించకుండా పోయిన యువతుల వివరాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

రేప్ చేస్తే దాడి .. మళ్లీ కొడతారేమోనని ...

రేప్ చేస్తే దాడి .. మళ్లీ కొడతారేమోనని ...

గతంలో ఓ యువతిపై లైంగికదాడి చేసిన శ్రీనివాస్‌ను బొమ్మాలరామారం గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. ఇక అప్పటి నుంచి యువతులకు లిఫ్ట్ చెప్పి బండిపై ఎక్కించుకొని నమ్మించి .. తర్వాత అఘాయిత్యానికి పాల్పడేవాడు. పోలీసుల అదుపులో ఉన్న శ్రీనివాస్‌ను విచారించిన ఓ అధికారి అతని మనస్తత్వాన్ని అంచనా వేశాడు. యువతులను కోరిక తీర్చమనేవాడని .. ఒప్పుకొకుంటే వదిలేసే వాడు కాదని .. వారు బయటకెళ్లి ఎవరికైనా చెబితే మళ్లీ కొడతారనే భయంతో హతమార్చేవాడని .. ఇదే అతని నైజమని ఆ అధికారి పేర్కొన్నారు.

English summary
Srinivas will not join anyone. But he only speaks to everyone only when he is accused of unwillingness. This is the human mind's knowledge to stay away from it. On the 25th of last month, he lift up and raped her. On the 26th of May, he appeared in the town. he also played cricket for children in the town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X