బెట్టింగ్ యాప్స్ మాఫీయాను వణికించిన ఒకే ఒక్కడు.. మామూలు ఆటగాడు కాదు

కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు.దీని వల్ల యువత పూర్తిగా తప్పు దోవ పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ గురించి కొద్ది రోజులు క్రితం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం రియాక్ట్ అయ్యారు. ఈ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సరిగ్గా ఇదే సమయంలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అసలైన ఆటగాడు. అతను మరెవరో కాదు 'నా అన్వేషణ' ఫేం అన్వేష్. ఇతని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'నా అన్వేషణ' అనే యూట్యూబ్ ఛానల్‌ ద్వారా అన్వేష్ ఫుల్ పాపులర్ అయ్యాడు. ప్రపంచ యాత్రికుడిగా అన్వేష్ మంచి గుర్తింపు ఉంది. ఒక్కో వీడియోకు మిలియన్ వ్యూస్ సాధిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి బెట్టింగ్ మాఫియా గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో కూడా అన్వేష్ వెల్లడించారు.

betting mafia was caught thanks to the investigation of naa anveshana fame anvesh

భయ్యా సన్నీ యాదవ్ చేస్తోన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ గురించి కళ్లకు కట్టినట్టు చూపించాడు అన్వేష్. సన్నీ యాదవ్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఇలా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడంటూ అతని గుట్టును బయటపెట్టాడు. అలాగే ఇమ్రాన్ (పరేషాన్ బాయ్స్) బండారాన్ని సైతం అన్వేష్ బహిర్గతం చేశాడు.ఇతను రూ. 25 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి సంపాదించాడు. 6 స్పోర్ట్స్ బైక్ లు, నాలుగు కార్లు, 3 హోటల్స్ ఉన్నాయని, బెట్టింగ్ మాఫియాలో అతి పెద్ద తిమింగలం ఇతనే అంటూ అన్వేష్ బాంబ్ పేల్చాడు. దీంతో బెట్టింగ్ యాప్‌ల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

దీనిలో భాగంగానే కొందరు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌ ఖాన్‌, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్‌‌, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హన్మంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా షెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు మొదలగు సినీ సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి తన వీడియోలతో 'నా అన్వేషణ' ఫేం అన్వేష్ చేసిన పుణ్యమే ఈ రోజున బెట్టింగ్ మాఫీయాను మొత్తం బయటకు వచ్చేలా చేసిందనే చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+