వీడిన మర్డర్ మిస్టరీ: భైంసా ఐదుగురి హత్య కేసును చేధించిన పోలీసులు

దరాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసాలో సంచలనం సృష్టించిన ఐదుగురి దారుణ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఆయుధాలు, బంగారం, భారీ నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

bhainsa 5 family members murder revealed by police

నిర్మల్ డీఎస్పీ ఆఫీసులో నిందితులను ఎస్పీ తరుణ్ జోషి మీడియా ఎదుట శనివారం ప్రవేశపెట్టారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్యలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే... మే 10వ తేదీన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను దుండగులు అతి కిరాతకంగా పదునైన కత్తులతో గొంతులు కోసి హతమార్చిన సంగతి తెలిసిందే. తొలుత భైంసా పట్టణంలో శివాజీ చౌక్‌లో పాత ఇనుపసామన్ విక్రయ దుకాణంలో ఉన్న నయామత్‌ఖాన్ (55), యూనిస్‌ఖాన్ (35)లపై కళ్లల్లో కారం చల్లి గొంతుకోసి హత్యచేశారు.

bhainsa 5 family members murder revealed by police

ఈ సమయంలో హంతకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన షేక్ అమీర్, జబ్బర్‌లకు సైతం గాయాలయ్యాయి. అక్కడి నుంచి దుండగులు బార్‌ఇమామ్‌గల్లిలోని నియామతుల్లాఖాన్ ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్య, మాజీ కౌన్సిలర్ వహిదాఖాన్(55)ను కూడా గొంతుకోసి హత్యచేశారు.

అంతకుముందే నయాబాదిలోని నియామతుల్లాఖాన్ రక్త సంబంధీకులైన అక్రమ్‌బీ ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో అనారోగ్యంతో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న అక్రమ్‌బీ(62)పై కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఆ సమయంలో టీవీ చూస్తున్న పిల్లలు భయంతో పరుగులు పెట్టారు.

ఆయేషాబేగం (15)లపై విచక్షణా రహితంగా దాడిచేసి పారిపోయారు. స్థానికులు అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో అయేషా చనిపోయింది. ఈ హత్యలకు కారణం రెండువర్గాల మధ్య జరిగిన గొడవలేనని పోలీసులు తేల్చారు. నిందితులను గుర్తించి దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు శనివారం వారిని అరెస్ట్ చేశారు.

bhainsa 5 family members murder revealed by police

ఓ స్థలం విషయంలో చోటుచేసుకున్న చిన్నపాటి వివాదం ఐదుగుర్ని పొట్టన పెట్టుకుందన్నారు. జావిద్‌ఖాన్, నూరుల్లా ఖాన్‌తోపాటు పలువురు దుండగలు తల్వార్‌లతో ఈ హత్యలకు తెగబడ్డారని చెప్పారు. నియామతుల్లాఖాన్ కుమారుడిపై 2013లో జావిద్‌ఖాన్‌తోపాటు పలువురు దాడికి దిగారని, ఈ కేసులో ఆగస్టు 2015లో కోర్టు నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష విధించినట్లు తెలిపారు.

పట్టణంలోని జైనాబుద్ధీన్ గల్లీకి చెందిన నియామత్ ఖాన్ నిర్మల్ రోడ్డులో అన్నకుమారుడితో కలిసి ఓ దుకాణాన్ని నడుపుతున్నారు. వీరికి పక్కనే ఉన్న జావిద్ ఖాన్ కుటుంబంతో చాలా రోజులుగా కక్ష్యలు ఉన్నాయి. పలుమార్లు ఇరుకుటుంబాల వారు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కాగా, హత్యకు గురైన నియామతుల్లాఖాన్, ఆయన సతీమణి వహిదాఖాన్‌లు గతంలో ఎంఐఎం తరఫున కౌన్సిలర్లుగా పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+