హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాగ్యనగరంలో భారత్ జోడో యాత్ర: ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు; రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుందిలా!!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఆ పార్టీ నేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు హైదరాబాద్ లోకి ప్రవేశించింది. భాగ్యనగరంలో రాహుల్ గాంధీ పాదయాత్ర నేపధ్యంలో జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

నేడు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది ఇలా

నేడు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది ఇలా

నేడు శంషాబాద్ నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జెండాలతో, భారీగా కాంగ్రెస్ శ్రేణులతో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఇక ఈ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా ఉదయం శంషాబాద్ నుండి ఆరాంఘర్ మీదుగా పురానా పూల్ కు రాహుల్ గాంధీ యాత్ర చేరుకోనుంది. సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్ మీదుగా నెక్లెస్ రోడ్ కు యాత్ర చేరుకుంటుంది. ఇక ఏడవ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని రాహుల్ గాంధీ ఆవిష్కరించనున్నారు.

మొదలైన రాహుల్ పాదయాత్ర... ఆయనతో పాటు కాంగ్రెస్ కీలక నాయకులు

మొదలైన రాహుల్ పాదయాత్ర... ఆయనతో పాటు కాంగ్రెస్ కీలక నాయకులు


శంషాబాద్ నుంచి కాలేజి విద్యార్థులతో కలిసి నడుస్తున్న రాహుల్ గాంధీ, వారితో ముచ్చటిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. శంషాబాద్ వద్ద ఒక విద్యార్థిని మాట్లాడి ఆమె భరత నాట్యం వస్తుందని తెలుసుకొని ఆమె చేసిన క్లాసికల్ డ్యాన్స్ తిలకించిన రాహుల్ సదరు విద్యార్థినిని అభినందించారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ తదితరులు పాల్గొంటున్నారు.

రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర సభ

రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర సభ

నేడు సాయంత్రం రాహుల్ తో పాటు జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర సభ నిర్వహించనున్నారు. రాజేంద్ర నగర్ నుండి శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు కొనసాగనున్న రాహుల్ గాంధీ యాత్రకు దారిపొడవునా స్వాగతం పలకడానికి జెండాలు, ఫ్లెక్సీలను కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు .. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు

ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు .. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు

ఇక పాదయాత్ర జరిగే మూడు కిలోమీటర్ల రేడియస్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు నుండి రెండు రోజులపాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నగరంలో కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. రెండు రోజులపాటు యాత్ర జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. నేడు ఆరాంఘర్, బహదూర్ పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీభవన్, నక్లెస్ రోడ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకూ యాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ ను ఇతర ప్రాంతాల మీదుగా మళ్ళించనున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే ప్రాంతాలలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రేపు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసే ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

English summary
Bharat Jodo Yatra will continue for two days in hyderabad. Today in Shamshabad, Rahul Gandhi started Bharat Jodo Yatra. Traffic restrictions have been imposed in the areas where Rahul is doing his padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X