కవిత సంచలన నిర్ణయం: భారత జాగృతి కమిటీలన్నీ రద్దు
హైదరాబాద్: భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు కవిత ఆదివారం ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కవిత తెలిపారు.
కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని కవిత స్పష్టం చేశారు. అయితే కమిటీల రద్దుకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, గతంలో టీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మార్చారు కవిత. ఈ క్రమంలోనే భారత్ జాగృతి కమిటీలను వేశారు. పలు రాష్ట్రాలకు కూడా కమిటీల బాధ్యులను ప్రకటించారు.

అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ కొత్త కమిటీలను వేస్తారా? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచిచూడాలి. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications