'రాజీవ్ యువ వికాసం ' అప్లై చేసినవారికి గుడ్ న్యూస్

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం. ఈ పథకాన్ని మార్చి 17న అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యవ వికాసం దరఖాస్తులకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇక ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. అర్హులైన లబ్దిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 న రుణాలు మంజూరు చేయనుంది. 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు ఇవ్వనున్నట్లు రేవంత్ సర్కార్ పేర్కొంది.

అయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక ఉంటుందన్న ప్రచారంతో చాలా మంది దరఖాస్తుదారులు ఆందోళనకు లోనయ్యారు. దీంతో ఇదంతా ప్రచారమేనని.. అలాంటిది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దీంతో ఈ ప్రచారానికి తెర పడింది.

ఇదే విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాజీవ్ యువ వికాసం స్కీం లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ ను ప్రాధాన్యంగా తీసుకుంటారన్న వార్తలు నిజం కాదని.. అందులో వాస్తవం లేదని అన్నారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. దీంతో వేల మంది దరఖాస్తుదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రతిపక్షనేతలు తెలంగాణ యువత జీవితాలతో ఆడుకోవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ యవ వికాసం పథకం ద్వారా అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా సాగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. వీలైనంత వేగంగా లబ్దిదారుల వడపోత చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు.

Bhatti Vikramarka Clarifies No Link Between CIBIL Score and Rajiv Yuva Vikasam Scheme

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+