తెలంగాణకు డెంగ్యూ సోకింది
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రానికి డెంగ్యూ సోకిందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధికార పార్టీ సేవలో తరిస్తున్నాయని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ప్రజలు డెంగ్యూతో బాధపడుతుంటే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం సరిగా లేకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రుల్లో లక్షలు దారపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని తెరాస ప్రభుత్వం కుప్పకూల్చిందన్నారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు.












Click it and Unblock the Notifications