కాంగ్రెస్ పార్టీకి షాక్: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భువనగిరిలో తన అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి నేరుగా ప్రగతి భవన్ వెళ్లారు.

సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ రెడ్డి, పలువురు సర్పంచులు, నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనిల్ కుమార్ రెడ్డికి గులాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. భువనగిరి నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నది తప్పని అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Bhuvanagiri dcc president anil kumar reddy joins brs on the presence of CM KCR

ఈ మేరకు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం గమనార్హం. చేరికల సందర్భంగా సీఎంకేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనిల్ కుమార్ రెడ్డిని కేసీఆర్ అభినందించారు.

తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ధరణి పోర్టల్‌ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని, ధరణి పోర్టల్‌లో భూములను డిజిటలైజ్‌ చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా ఉందని, ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమి మార్చగలరన్నారు. ధరణితోనే రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగాయని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి మెరుగుపడిందన్నారు.

బీఆర్‌ఎస్‌ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రూ.80వేలకోట్టు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిపోయిందని కేసీఆర్ చెప్పారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు, బీమా అమలు చేస్తున్నామని, ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమవుతుందన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు నిధులు ఎలా జమవ్వాలని ప్రశ్నించారు.

కాగా, కర్ణాటక రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరిగిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చిన్న, పెద్ద నేతలు అదే బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాకిస్తూ భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+