బిగ్ అలెర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాక రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్.. తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు రేపు ఉదయం వరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమురం భీం, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Big alert for the people of Telangana Heavy rains in these districts

మరోవైపు నైరుతి రుతుపవనాల రాక కారణంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో భారీ వర్షాలకు బెంగళూరు నగరం అట్టుడికిపోయింది. అటు మహారాష్ట్రలోని ముంబై కూడా భారీ వర్షాలకు మునిగిపోయింది. రోడ్లు, కాలనీలతోపాటు మెట్రో స్టేషన్లు సైతం ముంబైలో నీట మునిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+