ఎమ్మెల్సీ కవితకు ఈడీ, సీబీఐ బిగ్ షాక్!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 16 నుండి తీహార్ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కవితకు మరో మారు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా ఈడి అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఢిల్లీలోని హౌస్ అవెన్యూకోర్టు ఎమ్మెల్సీ కవితకు జ్యూడిషియల్ రిమాండ్ ను పొడిగించి షాక్ ఇచ్చింది.

మళ్ళీ కవితకు రిమాండ్
ఇప్పటికే పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించిన కోర్టు నేడు మళ్ళీ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉందని కాబట్టి కవిత రిమాండ్ ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించడంతో ఈడీ వాదనాలతో ఏకీభవించిన న్యాయస్థానం మళ్లీ కవిత రిమాండ్ ను 14 రోజులు పొడిగిస్తూ తీర్పిచ్చింది.

Big Shock for MLC Kavitha Judicial Remand extension in ED case CBI case hearing adjourned

సిబిఐ ఈ ఛార్జ్ షీట్ పై మరోసారి విచారణ వాయిదా
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో సిపిఐ కేసును ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కోర్టులో సిబీఐ లిక్కర్ కేసు చార్జ్ షీట్ పై విచారణ జరగాల్సి ఉండగా వర్చువల్ గా కోర్టులో కవితతో పాటు ఇతర నిందితులను హాజరు పరిచారు. సిబిఐ అధికారులు సిబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత ఏ17 గా ఉన్నారు. అయితే ఈ కేసులో సిబిఐ ఈ ఛార్జ్ షీట్ పై మరోసారి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది.

సీబీఐ కేసులోనూ కవితకు నిరీక్షణ
ధర్మాసనం దీంతో సిబీఐ కేసులో కూడా ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం పోరాటం చేసిన కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎమ్మెల్సీ కవితకు ఈ కేసులో బెయిల్ దొరకలేదు. ఈడి ఓ వైపు సిబిఐ మరోవైపు ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ మూకుమ్మడిగా దాడి చేస్తుంటే కవిత ఈ కేసులను ఎదుర్కోవడానికి పోరాటం చేస్తోంది కానీ అడుగడుగునా ఓటమి పాలవుతోంది. ఇటీవల అనారోగ్యానికి కూడా గురైన కవిత తీహార్ జైల్లో మగ్గిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+