కాచిగూడలో భారీ చోరీ: నమ్మి పిలిస్తే.. ఇల్లు గుళ్ల చేశాడు, నిందితుడి కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్: నగరంలోని కాచిగూడలో భారీ చోరీ జరిగింది. తమకు సహాయకంగా ఉంటాడని భావించి తెచ్చుకున్న ఓ వ్యక్తి ఆ కుటుంబాన్ని మోసం చేసి తిన్న ఇంటికి కన్నం వేశాడు. భారీ మొత్తంలో బంగారు, వెండి నగలను అపహరించుకుపోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తాలోని గోకుల్‌ధామ్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెంబర్ 205లో వ్యాపారి విజయ్ కాలే(72), ఆయన భార్య ఛాయా కాలే(62) నివాసం ఉంటున్నారు. ఇటీవల విజయ్ కాలే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.

కాగా, చికిత్స తీసుకుంటు విజయ్ కాలేకు సహాయకంగా ఉంటాడని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నందగోపాల్(32) అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నారు కాలే దంపతులు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇంటిని శుభ్రం చేసేందుకు నందగోపాల్‌కు ఛాయా కాలే తాళాలు ఇచ్చి పంపింది. అతడు 11.30 గంటలకు తిరిగి ఆస్పత్రికి వచ్చి తాళాలు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బయటికి వెళ్లిన నందగోపాల్ తిరిగిరాలేదు.
గురువారం రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లిన ఛాయా కాలే.. బీరువా తెరిచి ఉండటాన్ని గమనించింది. వెంటనే బీరువాలో చూడగా అందులోని రూ. 50 లక్షల విలువైన 80 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి కనిపించలేదు. ఇది నందగోపాల్ పనే అని భావించిన ఛాయా కాలే.. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు పోలీసులు. నిందితుడు నందగోపాల్ డుప్లికేట్ తాళం చెవితో బీరువాను తెరిచి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ భారీ చోరీ స్థానికంగా కలకలం సృష్టించింది.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
మోసాలిసా పెళ్లి!.. హైటెన్షన్ నడుమ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications