బీజేపీ నేతపై హత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్: తనపై తానే దాడి, ఎందుకో తెలుసా?
హైదరాబాద్: బీజేపీ నాయకుడు ఉదయ్ భాస్కర్ గౌడ్‌పై హత్యాయత్నం కేసు మరో మలుపు తిరిగింది. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చారు పోలీసులు. రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ్ భాస్కర్.. గతంలో తనపై క్రిమినల్ కేసులు ఉండటంతో గన్‌మెన్ల కోసం తన మీద తానే హత్యాయత్నం చేసుకున్నాడు.
ఆ తర్వాత తనపై దాడి జరిగిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు అసలు విషయం తేల్చారు. నిందితుడు ఉదయ్ భాస్కర్ గౌడ్ తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు.

డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. భాస్కర్ గౌడ్ బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. పలుకుబడి కోసం మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు. గన్‌మెన్లు ఉంటే సమాజం గౌరవిస్తుందన్న దురుద్దేశంతో ఈ ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్‌లో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఇందుకోసం రూ. 2.50 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కాగా, ఉదయ్ భాస్కర్ పై హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. మర్డర్ ప్లాన్ కు సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ పద్మజ తెలిపారు.












Click it and Unblock the Notifications