Bigg Boss 5 Telugu: గ్రాండ్ ఫినాలె తేదీ ఇదే: టాప్-5లో: ఓటింగ్‌లో లీస్ట్: టఫ్ టాస్కులతో
హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. ముగింపు దశకు వచ్చేసింది. ఇంకో రెండు వారాలే. మూడో వారం గ్రాండ్ ఫినాలె ఉంటుంది. కిందటి వారం యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం ఏడుమంది కంటెస్టెంట్లు కొనసాగుతున్నారు. వారిలో ఈ రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారు. మూడో వారంలోో గ్రాండ్ ఫినాలె నాడు విన్నర్‌ను ప్రకటిస్తారు నిర్వాహకులు.

ఇక టఫ్ టాస్క్..
బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకోవడానికి ఈ మూడు వారాలు అత్యంత కీలకంగా మారాయి. కంటెస్టెంట్లకు అగ్నిపరీక్షను పెడుతున్నాయి. టాప్-5, టాప్-3లో నిలవాలంటే.. ఈ మూడు వారాల వ్యవధిలో కంటెస్టెంట్లు తమ పెర్‌ఫార్మెన్స్‌కు మరింత పదును పెట్టాల్సి ఉంటుంది. టాస్క్‌ల మీదే కాన్సన్‌ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ముందు బిగ్‌బాస్ ఇచ్చేవి కూడా టఫ్ టాస్క్‌లే. అందులో నెగ్గుకొస్తేనే టాప్-5 లేదా టాప్-3లో నిలవడానికి అవకాశం ఉంటుంది.

టాఫ్ కాంపిటీటర్ ఎలిమినేట్ కావడం..
నిజానికి- ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. బిగ్‌బాస్ హౌస్‌లో 12 వారాలు అతను కొనసాగితే.. అందులో ఎనిమిదిసార్లు నామినేట్ అయ్యాడు. ఇలా నామినేట్ అయిన ప్రతీసారి యాంకర్ రవి.. తన బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎలిమినేషన్స్ నుంచి బయటపడ్డాడు. కిందటి వారం మాత్రం ఎలిమినేట్ కాక తప్పలేదు. యాంకర్ రవి వంటి టఫ్ కాంపిటీటర్, టాప్-5లో చోటు దక్కించుకుంటాడని అంచనాలు ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాల్సి వచ్చిందంటే పోటీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

లాజిక్ మిస్ అయిన వీజే సన్నీ..
వీజే సన్నీ తనకు లభించిన పాస్‌ను వృధా చేసుకున్నాడు. ఈ పాస్‌ను యాంకర్ రవికి ఇచ్చి ఉంటే అతను హౌస్‌లో కొనసాగే వాడు. అతను కాజల్‌కు ఇవ్వడం, ఆమె సేఫ్ కావడంతో ఆ పాస్ వేస్ట్ అయింది. అతను ఏ మాత్రం లాజిక్‌గా ఆలోచించి ఉన్నా యాంకర్ రవి, హౌస్‌లో కొనసాగడానికి వీలు ఉండేది. చాలాసార్లు ఆర్జే కాజల్ ఎలిమినేషన్‌లో చివరి రౌండ్ వరకూ వచ్చినప్పటికీ- ఆమె బయటపడ్డారు. 10వ వారంలో ఎలిమినేట్ అయినా.. ఆమెకు బదులుగా జెస్సీ హౌస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది.

ఈ వారం నామినేషన్స్‌లో..
ఈ వారం నామినేషన్స్‌లో అయిదుమంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇది 13వ వారం. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, మానస్ నాగులపల్లి, ప్రియాంక అలియాస్ పింకీ, ఆర్జే కాజల్, సిరి హన్మంతు.. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఈ ఆదివారం అధికారికంగా తెలిసిపోతుంది. ఇప్పటిదాకా అందని ఓటింగ్ ప్రకారం.. ప్రియాంక లీస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు పోల్ అయిన ఓట్ల శాతం 10కి లోపే ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీరామచంద్ర ఓటింగ్‌లో టాప్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం.
Recommended Video

గ్రాండ్ ఫినాలె ఎప్పుడంటే..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలె తేదీ వెలువడింది. ఈ నెల 19వ తేదీన ఆదివారం గ్రాండ్ ఫినాలె నిర్వహించే అవకాశం ఉంది. అప్పటికి హౌస్‌లో అయిదుమంది మాత్రమే మిగులుతారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలె నాడు టాప్-5ను సెలెక్ట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. 5, 12 తేదీల్లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారు. 19వ తేదీన గ్రాండ్ ఫినాలె నాటికి అయిదుమంది మిగులుతారు. వారిలో ఎవరు విన్నర్ అనేది అదే రోజు రాత్రి తేలిపోతుంది.












Click it and Unblock the Notifications