బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్
సిద్దిపేట: తెలుగు బిగ్‌బాస్ షో ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం కొల్గూరులో అతని నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు అతని తమ్ముడు మహావీర్ను కూడా అరెస్టు చేశారు. పల్లవి ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అరెస్ట్ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు. హైదరాబాద్ నగరంలోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ విజేతగా గెలుపొందడంతో అతని అభిమానులు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. దీంతో ఆ గొడవ కారణంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో సిద్దిపేటలో అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.

కాగా, బిగ్‌బాస్ 7 ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్.. రాత్రి 12 గంటల సమయంలో స్టూడియోస్ నుంచి బయటకు వచ్చారు. దీంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు.
అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ కూడా బయటకు వచ్చారు. ఈ సమయంలోనే ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలైంది. పలువురు అభిమానులు రెచ్చిపోయి అమర్‌దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. దీంతో పలు కార్లతోపాటు దాదాపు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. గొడవ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు.
ఈ ఘటనపై రెండు వేర్వేరు కేసులను జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించినందుకు కారణమైన బిగ్‌బాస్ విజేత ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల అద్దాలు పగుల గొట్టిన వారిపై ఫిర్యాదు చేసినట్లు ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖను కోరారు.
అయితే, తాము ర్యాలీ వద్దని చెప్పినా.. వినకుండా ర్యాలీ తీయడంతో ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసి.. తాజాగా అరెస్ట్ చేశారు. ప్రశాంత్‌ను అతని నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేయడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేయొద్దని కోరారు. తనపై కొందరు దుష్ఫ్రచారం చేశారని ప్రశాంత్ తెలిపారు. ర్యాలీ వద్దని పోలీసులు చెప్పినప్పుడు.. వారి మాటలు తనకు నిపించలేదని చెప్పుకొచ్చారు.
-
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications