రేసింగ్, 2 గంటల్లో 200 బైక్‌లు: పేరెంట్స్‌పై కేసు పెడతామని హెచ్చరిక
హైదరాబాద్: భాగ్యనగరంలోని పాతబస్తీలో బైక్ రేసింగ్‌తో మైనర్లు హల్‌చల్ చేస్తున్నారు. దీంతో, గురువారం రాత్రి పోలీసులు రెండు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి... 200 బైకులను, 180 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
రాత్రి పది గంటల తర్వాత, మరికొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒకటి దాటిన తర్వాత నుంచి ఉదయం వరకు మైనర్లు బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. దీంతో, గురువారం నాడు పోలీసులు రాత్రి వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించారు.

రెండు గంటల సమయంలోనే 200 బైకులను, 180 మంది మైనర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్‌లతో పాటు తల్లిదండ్రులకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లు మరోసారి ఇలా బైక్ రేసింగ్ నిర్వహిస్తే తల్లిదండ్రుల పైన కేసులు పెడతామని హెచ్చరించారు.
దొంగనోట్లు చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్టు
ఉప్పల్ పరిధి చిలుకానగర్లో దొంగనోట్లు చలాణి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.25 వేల విలువైన రూ.500 దొంగనోట్లను మార్చేందుకు యత్నిస్తున్న దండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications