టీ సర్కార్ కు మద్యం టెండర్ల ద్వారా వేలకోట్లు.!రైతుల ధాన్యం కొనేందుకు వెచ్చిస్తే తప్పేంటన్ని వీహెచ్.!

సిర్పూర్/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ కు అత్యంత గౌరవం ఇచ్చిందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు అన్నారు. అమిత్ షా మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకోవాలనీ అంబేడ్కర్ కు భారతరత్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి మద్యం టెండర్ల ద్వారా దాదాపు 1400 కోట్ల ఆదాయం వచ్చిందని, చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధి ఉంటే, రైతులపై ప్రేమ ఉంటే మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులతో రైతుల నుండి వడ్లను కొనగొలూ చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న టి.అర్.ఎస్ పార్టీ చావు డప్పు కొట్టాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని, అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తే పోలీసుల చేత కేసులు నమోదు చేయిస్తారని వీహెచ్ ధ్వజమెత్తారు. ఈ విషయమై చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వీహెచ్ విజ్ఞప్తి చేసారు. అధికారంలో ఉన్న గులాబీ ప్రభుత్వం ఇలా చావ్వు డప్పు కొట్టడం ఏంటని వీహెచ్ ప్రశ్నించారు.

 Billions through liquor tenders to T Sarkar.!Cm has to buy grains with that Funds.!-VH

ఒక పక్క రైతులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆత్మా హత్యలు చేసుకుంటున్నారని కానీ రాష్ట్ర ప్రభుత్వం చావు డప్పులు అంటూ కాలయాపన చేయడం తప్పని, రాష్ట్ర ప్రజలు టి.అర్.ఎస్, చంద్రశేఖర్ రావు కు ఓటు వేసి గెలిపించారని అందుకే ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వి.హెచ్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ సిర్పూర్ ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే సిర్పూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.

 Billions through liquor tenders to T Sarkar.!Cm has to buy grains with that Funds.!-VH

మంగళవారం నాడు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో కలసి సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమములో పాల్గొన్నారు. సిర్పూర్ టౌన్ లో జరిగిన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమములో వి.హెచ్ మాట్లాడారు. సిర్పూర్ లో కాంగ్రెస్ పార్టీకి బలమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+