బిల్ట్ తెరువరు?: కాగిత పరిశ్రమపై ఆశలు ఆవిరి!
మంగపేట మండలం కమలాపూర్‌లోని బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) కాగితపు గుజ్జు పరిశ్రమ పునఃప్రారంభం ఉత్తదే అని తేలిపోయింది.
వరంగల్: మంగపేట మండలం కమలాపూర్‌లోని బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) కాగితపు గుజ్జు పరిశ్రమ పునఃప్రారంభం ఉత్తదే అని తేలిపోయింది. వేల మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, చేసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోవడం లేదు. బిల్ట్ పునఃప్రారంభంపై ప్రబుత్వం చెప్పిన గడువు ముగిసి ఏడాది గడుస్తున్నా పరిస్థితిలో ఎలాిం మార్పూ కనిపించడం లేదు. దీనిపై ఆధారపడిన మూడు వేల మంది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
బిల్ట్ పరిశ్రమను పునరుద్ధరించే విషయంలో సంస్థ యాజమాన్యం నుంచి స్పందన కనిపించడం లేదని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఆదివారం ప్రకించారు. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా యాజమాన్యం పట్టించుకోవడంలేదన్నారు. ఎంపీ ప్రకటనతో పరిశ్రమ తెరుచుకోవడం జరిగేపని కాదని తేలిపోయిందని కార్మికులు వాపోతున్నారు. మూతపడిన పరిశ్రమలను పునఃప్రారంభించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహక విధానం అమలు చేస్తోంది. ఈ విధానం కింద బిల్ట్ పునఃప్రారంభించాలని నిర్ణయించింది.
బిల్ట్‌ను మళ్లీ తెరిచేందుకు అవసరమైన ప్రోత్సాహకాలపై పలు నిర్ణయాలు తీసుకుంది. 2015 డిసెంబరు 14న ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సబ్సిడీపై ముడి కలప, కరెంటు, నిరంతరంగా బొగ్గు సరఫరా అంశాలపై ఉత్తర్వుల్లో పేర్కొంది. ముడి సరుకు సబ్సిడీ కోసం ఏటా రూ. 30 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. బిల్ట్‌కు కేయించే సబ్సిబీ మొత్తాన్ని పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి నిధుల (ఐఐడీఎఫ్) నుంచి ఇవ్వాలని... ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (న్‌పీడీసీఎల్) 25 శాతం ఖరిఫ్‌కే మూడు మెగావాట్ల కరెంటును సరఫరా చేయాలని పేర్కొంది.

కరెంటు సబ్సిడీ కోసం రూ. 9 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. కాగితపు గుజ్జును ఉత్పత్తి చేసే బిల్ట్‌కు ముడి సరుకుగా వినియోగించే జామాయిల్, వెదురు కలపను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించింది. బిల్ట్ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై ఉత్తర్వులు జారీ చేసి 11 నెలలు గడిచినా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకురావడంలేదు. పెండింగ్ వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలపై కార్మిక సంఘాలతో ఈ ఏడాది జనవరి 8న ఒప్పందాలు జరగాల్సి ఉంది. ఈ అంశంపైనా ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. దీంతో బిల్ట్ పునఃప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
బిల్ట్ నేపథ్యం ఇదీ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం కమలాపురంలో 1975లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రేయాన్స్ పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. 1981లో ఈ పరిశ్రమలో ఉత్పత్తి మొదలైంది. అనంతరం ఈ పరిశ్రమను బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) యాజమాన్యం కొనుగోలు చేసింది. 610 ఎకరాల్లో నెలకొల్పిన ఈ పరిశ్రమలో ఏా 90 వేల టన్నుల కాగితపు గుజ్జును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
710 పర్మనెంట్, 20వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఈ పరిశ్రమ ఆధారంగా 6వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దీనిలో ఉత్పత్తి అయిన కాగితపు గుజ్జును గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేస్తుండేది. అయితే, 2014 ఏప్రిల్‌లో గ్రాసిమ్ సంస్థ కాగితపు గుజ్జును కొనుగోలు నిలిపివేసింది. బహిరంగ మార్క్‌లో ధరలు తక్కువగా ఉండడమే దీనికి కారణంగా పేర్కొంది. ఉత్పత్తి అయిన కాగితపు గుజ్జు అమ్మకం కాకపోవడంతో 2014 ఏప్రిల్ 6న బిల్ట్ యాజమాన్యం పరిశ్రమలో కార్యకలాపాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా దీనిపై ఆధారపడిన ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి కరువైంది.












Click it and Unblock the Notifications