Binocular: వైయస్ షర్మిల పార్టీకి ‘బైనాక్యులర్’ గుర్తును కేటాయించిన ఈసీ, కానీ..
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)కి కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా తమకు ఉమ్మడి గుర్తు కేటాయించాలని వైయస్సార్టీపీ ఈసీని ఇటీవల కోరింది.

ఈ క్రమంలో రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పేరా 10బీ కింద అనుమతిస్తూ ఈ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైయస్సార్టీపీ అభ్యర్థులకు బైనాక్యులర్ గుర్తును ఉమ్మడిగా కేటాయించింది.
నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఆ పార్టీ అభ్యర్థులకు బైనాక్యులర్ గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘం.. రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. అయితే, ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర అభ్యర్థులు ఎంచుకునేలా ఫ్రీ సింబల్స్ జాబితాలో బైనాక్యులర్ గుర్తు అందుబాటులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.
ఒకవేళ పార్టీ కనీసం 5 శాతం స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోతే మాత్రం ఉమ్మడి గుర్తు అందుబాటులో ఉండదని ఈసీ పేర్కొంది. రాష్ట్రానికి సంబంధించి మరి కొన్ని రిజిస్టర్డ్ పార్టీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్ముడి గుర్తు కేటాయించింది. ఆజాద్ పార్టీకి సీసీటీవీ కెమెరా గుర్తును, విద్యార్థుల రాజకీయ పార్టీకి బ్యాట్ గుర్తు, జన శంఖారావం పార్టీకి లేడీస్ ఫింగర్ గుర్తును కేటాయించింది.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని మొదట నిర్ణయించినప్పటికీ.. ఆ తర్వాత ఆ పార్టీ సానుకూలంగా స్పందించలేదని వైఎస్ షర్మిల తెలిపిన విషయం తెలిసిందే. ఓట్లు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని అనుకున్నామని కానీ.. ఇప్పుడు మాత్రం ఒంటరిగానే వైయస్సార్టీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications