బిజెపి శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం

అమరావతి: బిజెపి శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలతో రాజధాని భవన నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఆయనను అక్కడే వదిలేసి ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు రెండు బస్సుల్లో వెళ్ళిపోయారు. తన స్వంతకారును పిలిపించుకొని ఆ తర్వాత విష్ణుకుమార్ రాజు గమ్యస్థానానికి చేరుకొన్నారు.

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్ళిన సమయంలో బిజెపి శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజును వదిలేసి బస్సు వెళ్ళిపోయింది. దీంతో తన స్వంతకారును పిలిపించుకొని విష్ణుకుమార్ రాజు వెళ్ళిన ఘటన బుధవారం నాడు చోటు చేసుకొంది.

ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఏపీకి చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాజధాని అమరావతి నగరంలో భవన నిర్మాణాల పనులను చూపేందుకు బుధవారం నాడు బస్సులో బయలుదేరారు. ఈ బస్సులో బిజెపి శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడ ఉన్నారు.

Bjlp leader Vishnu kumar raju gets bad experience at Amaravathi

బిజెపి శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు అక్కడ భవన నమూనాలను పరిశీలిస్తుండగానే ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులలో మంత్రి నారాయణతో కలిసి వెళ్ళిపోయారు. భవన నమూనాలను పరిశీలించి బయటకు వచ్చిన విష్ణుకుమార్ రాజుకు బస్సులు కన్పించలేదు.

తనను వదిలేసి వెళ్ళారని ఆలస్యంగా విష్ణుకుమార్ రాజు గుర్తించారు. అయితే ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విష్ణుకుమార్ రాజు ఉన్నారని భావించి బస్సులు బయలుదేరి ఉంటాయని చెబుతున్నారు.

అయితే బస్సులు వెళ్ళిపోవడంతో విష్ణుకుమార్ రాజు తన స్వంతకారును పిలిపించుకొన్నాడు. కారు వచ్చే వరకు అక్కడే ఆయన ఎదురు చూశాడు. తన కారు రాగానే ఆయన ఆ కారులో వెళ్ళిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+