మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొట్లాటలోనూ తగ్గేదేలే; పోటాపోటీ ఆందోళనలతో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఘర్షణ, మంచిర్యాలలో ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టు రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా తలపడుతున్నారు. తిట్టుకోవటంలోనే కాదు కొట్టుకోవటంలో కూడా తగ్గేదే లేదని అంటున్నారు. తాజాగా పోటాపోటీ ఆందోళనలతో బాహాబాహీకి దిగారు మంచిర్యాల బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు

తెలంగాణాలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పొలిటికల్ మైండ్ గేమ్.. పోటాపోటీగా సర్వేలతో బడా ప్లాన్!!తెలంగాణాలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పొలిటికల్ మైండ్ గేమ్.. పోటాపోటీగా సర్వేలతో బడా ప్లాన్!!

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ .. బీజేపీ నాయకుల దీక్ష వర్సెస్ టీఆర్ఎస్ ఆందోళన

తాజాగా పాలు మరియు పాల ఉత్పత్తులపై జిఎస్టి విధించడాన్ని, అలాగే జీఎస్టీ పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు. మోడీని టార్గెట్ చేసి నినాదాలతో హోరెత్తించారు. ఇక ఇదే సమయంలో వరద బాధితులను ఆదుకోవాలని బిజెపి నాయకులు దీక్షకు దిగారు.మౌన దీక్ష చేపట్టిన బీజేపీ నాయకులు దీక్ష అనంతరం కేసీఆర్ సర్కార్ తీరుపై మండిపడ్డారు . వరదలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, రైతులు పంట నష్టపోయి కష్టపడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మంచిర్యాల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించలేదు అని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా వరద బాధితుల పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేసినట్టు తెలిపారు. వరద బాధితులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల ఐబీ లో రెండు పార్టీల నాయకుల ఆందోళనలతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

 కొట్టుకున్న బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు.. రంగంలోకి పోలీసులు

కొట్టుకున్న బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు.. రంగంలోకి పోలీసులు


ఇక మంచిర్యాలలో బిజెపి, టిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారి ఇరుపార్టీల నేతలు కొట్టుకునే దాకా వెళ్ళింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీ నేతలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించటంతో ఈ క్రమంలోనే ఒకరి వైఫల్యాలను మరొక పార్టీ నేతలు ఎత్తిచూపుతూ టార్గెట్ చేస్తున్నారు.

వరదల నష్టం చెప్పి ప్రజలను ఆదుకోవాలన్న బీజేపీ

వరదల నష్టం చెప్పి ప్రజలను ఆదుకోవాలన్న బీజేపీ


ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. వరదల కారణంగా జిల్లాలో దాదాపు పది వేల మంది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. అంతేకాదు వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపునకు గురి కాగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక వరద నష్టాన్ని అంచనా వేసి ప్రజలకు సహాయాన్ని అందించాలని బిజెపి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు.

జీఎస్టీ పెంపు ఉపసంహరించుకోవాలన్న టీఆర్ఎస్

జీఎస్టీ పెంపు ఉపసంహరించుకోవాలన్న టీఆర్ఎస్


ఇక సామాన్యుడి నడ్డి విరిగేలా జీఎస్టీ పెంపు కేంద్రం చేపట్టిందని, పాలు, పాల ఉత్పత్తుల పైన కూడా జిఎస్టి విధిస్తోంది అంటూ టిఆర్ఎస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేశారు. జీఎస్టీ పెంపు ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బాహాబాహీకి దిగిన నేతలు కొట్లాటకు దిగడంతో మంచిర్యాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నాయకులకు గాయాలు అయ్యాయి. ఇరు వర్గాల వారు కవ్వింపులకు దిగటంతో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత శాంతించింది.

English summary
The clash between BJP and TRS took place due to rivalry concerns. TRS protested the increase in GST while the BJP launched a campaign to provide flood relief to the poor. Due to this, there was a tension with quarrel between the activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X