'సోషల్ మీడియాను ఉపయోగించండి, తమిళనాట ప్రధాన పార్టీగా బీజేపీ'
ఆదివారం నాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు బీజేపీ ఎలా ఎదగాలో క్యాడర్‌కు సూచించారు. బీజేపీకి మీడియా మద్దతు లేదని, కాబట్టి కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చ
కరీంనగర్: భారతీయ జనతా పార్టీకి మీడియా మద్దతు లేదని, కాబట్టి అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు ఆదివారం నాడు సూచించారు.
ఆయన కరీంనగర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి సొంత మీడియా లేదని చెప్పారు. కాబట్టి సోషల్ మీడియానే మన ఆయుధం అన్నారు. దాని ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు.

అలాగే, తమిళనాడు పైనా స్పందించారు. తమిళనాట బీజేపీ ప్రధాన పార్టీగా అవతరించబోతుందని జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జైలుకు వెళ్లేవారని వ్యాఖ్యానించారు.
ఉత్తరాదిన వరుస విజయాలు, మహారాష్ట్ర, ఒడిశా స్థానిక ఎన్నికల్లో కమలం గెలుపు నేపథ్యంలో బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణాది పైన దృష్టి సారించిన నేతలు.. ఆయా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications