జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారులో బిగ్ ట్విస్ట్, కాంగ్రెస్ ఫార్ములా.. ఫైనల్ గా..!!

జూబ్లీహిల్స్ లో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల వ్యూహాలు మారుస్తున్నాయి. సామాజిక - స్థానిక సమీకరణాలే కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్.. బీఆర్ఎస్ తమ అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించాయి. బీజేపీ అభ్యర్ధి ఖరారులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఫార్ములానే అమలు చేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగా పార్టీ నేతలు ఎవరూ ఊహించని అభ్యర్ధి పేరు తెర పైకి వచ్చింది. అధికారికంగా ఈ రోజు ప్రకటన రానుంది.

జూబ్లీహిల్స్ లో బీజేపీ లెక్కలు మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర నేతలు ముగ్గురు పేర్లను కేంద్ర కమిటీకి సిఫార్సు చేసారు. దీంతో.. దీపక్ రెడ్డి వైపు తొలుత పార్టీ మొగ్గు చూపింది. అయితే, ఢిల్లీ నేతలు చివరి నిమిషంలో తమ ఆలోచన మార్చుకున్నారు. బీఆర్ఎస్ మాగంటి కుటుంబానికే సీటు ఇవ్వటం.. అటు కాంగ్రెస్ బీసీ అభ్యర్ధిని బరిలోకి దించటంతో బీజేపీ కొత్త ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. కాంగ్రెస్ బీసీ అభ్యర్ధిని ఖరారు చేయటంతో.. బీజేపీ సైతం ఇప్పుడు బీసీ ఫార్ములా వైపే మొగ్గు చూపుతుంది. అదే విధంగా ఎంఐఎం పోటీ పైన స్పష్టత రాలేదు. ఎంఐఎం కాంగ్రెస్ కు సహకరించే అవకాశం ఉండటంతో.. బీజేపీ సామాజిక లెక్కలను పరిగణలోకి తీసుకుంది.

BJP chances to Field BC Candidate for Jubilee hills by poll as latest discussions

బీసీ అభ్యర్దిగా బీజేపీ నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పేరు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర పార్టీ నేతలతో విక్రమ్ గౌడ్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు విక్రమ్ బీజేపీలోనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. దీంతో ఆయనను పార్టీలోకి తీసుకువచ్చి టికెట్ ఇవ్వాలన్నది ముఖ్య నేతల ఆలోచనగా చెబుతున్నారు.

ఇప్పటి వరకు దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి పేర్లు షార్ట్ లిస్ట్ చేయగా.. దీపక్ రెడ్డి వైపే హైకమాండ్ ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే.. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకోవటం.. జూబ్లీహిల్స్ లోనూ బీసీకే సీటు ఇవ్వటంతో.. బీజేపీ సైతం బీసీ అభ్యర్ధినే ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ రోజు తమ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+