వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాదయాత్రపై బండి భావోద్వేగం.!టీఆర్ఎస్ నియంత పాలన అంతమొందించడమే లక్ష్యమన్న సంజయ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రెండో విడుత పాదయాత్రతో చరిత్ర స్రుష్టించడంతోపాటు టీఆర్ఎస్ నియంత పాలనకు చరమ గీతం పాడాలన్నారు బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్. అందుకోసం బీజేపీ కార్యకర్తలంతా పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో ఖంగుతిన్న సీఎం చంద్రశేఖర్ రావు బీజేపీపై తప్పుడు ప్రచారం చేసినా జనం నమ్మలేదన్నారు. పాదయాత్ర చేయడం నా పూర్వ జన్మ సుక్రుతమని, పార్టీకి, జాతీయ నాయకత్వానికి తాను రుణపడి ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్.

 పాదయాత్ర నా పూర్వ జన్మ సుక్రుతం.. పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానన్న బండి సంజయ్

పాదయాత్ర నా పూర్వ జన్మ సుక్రుతం.. పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానన్న బండి సంజయ్

ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నామని తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. ఉదయం అంబేద్కర్ ఉత్సవాలు నిర్వహించిన తరువాత సాయంత్రం గద్వాల జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అమ్మవారి ఆశీస్సులు, జాతీయ నాయకత్వ సహకారం, కార్యకర్తల అండతో తొలి విడత ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, అన్ని రాష్ట్రాలు తెలంగాణ తరహాలో పాదయాత్ర చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించడం మనందరికీ గర్వకారణమన్నారు బండి సంజయ్.

 టీఆర్ఎస్ నియంత పాలనను అంతమొందించాలి.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేయాలన్న సంజయ్..

టీఆర్ఎస్ నియంత పాలనను అంతమొందించాలి.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేయాలన్న సంజయ్..

ఈనెల 14నుండి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్ బర్కత్ పురాలోని జిల్లా కార్యాలయంలో పాదయాత్ర ఏర్పాట్లపై సన్నాహక సమావేశం జరిగింది. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడంతోపాటు ప్రజలు ఎలాంటి పాలన కావాలనుకుంటున్నరో పరిశీలించేందుకే పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి తెలిపారు. టీఆర్ఎస్ నియంత పాలనలో జనం పడుతున్న బాధలను కళ్లారా చూసేందుకు యాత్ర చేస్తున్నామన్నారు బీజేపి తెలంగాణ ఛీఫ్.

 ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే ఆశయం.. కలిసి రావాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు

ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే ఆశయం.. కలిసి రావాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు

అంతే కాకుండా గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే ఈ ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యమని, ప్రజా క్షేమం కోసం వెనుకాడకుండా తెగించి కోట్లాడదామని, అందుకోసం అన్ని విధాలా సిద్ధమై పాదయాత్రకు తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పాదయాత్ర చేయడం తన పూర్వ జన్మ సుక్రుతమని, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని జనం ఎలాంటి పాలన కోరుకుంటున్నారో అర్ధం చేసుకోవడంతోపాటు టీఆర్ఎస్ నియంత పాలనను అంతమొందించడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు బండి సంజయ్.

 యాత్ర విజయవంతం శ్రమించాలి..ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశంలో సంజయ్

యాత్ర విజయవంతం శ్రమించాలి..ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశంలో సంజయ్


బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, పాదయాత్ర సహ ప్రముఖ్ లు టి.వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, కుమ్మరి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, బొమ్మ జయశ్రీ, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, నాగూరావు నామోజీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, రాణి రుద్రమదేవి, పోరెడ్డి కిశోర్, చందుపట్ల కీర్తిరెడ్డి, ఎస్పీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, గుండగోని భరత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

English summary
BJP Telangana president Bandi Sanjay wants to make history with the second Phase of Padayatra and sing the last anthem for the TRS dictatorship. That is why all BJP workers are called to come and participate in the walk voluntarily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X