Munugodu By Election: మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్..

వచ్చే నెల 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా కొత్త ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. దీనిపై బీజేపీ హైకోర్టుకు వెళ్లింది. మునుగోడులో ఓట్ల నమోదుపై భారతీయ జనతా పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఎల్లుండి విచారణ జరపనుంది.

జులై 31 వరకు ఉన్న ఓటరు జాబితానే పరిగణనలోకి తీసుకోవాలి బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఈ జాబితానే పరిగణలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరింది. ఫార్మ్‌- 6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని పిటిషన్ లో పేర్కొంది. తక్కువ సమయంలో 25 వేల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేసింది.

BJP filed a writ petition in the High Court against the registration of votes in munugodu

కాగా ఈ నెల 14న ఈసీ మునుగోడు ఓటరు జాబితాను ప్రకటించనుంది. హైకోర్టు ఆదేశించే వరకు లిస్ట్ ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ కోర్టును కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+